Asianet News TeluguAsianet News Telugu

జనసేన పొలిటిక్స్: ముద్రగడతో మాజీ జెడీ లక్ష్మినారాయణ భేటీ

కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంతో జనసేన నేత, సిబిఐ మాజీ జెడీ లక్ష్మీనారాయణ భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. కిర్లంపూడిలోని ముద్రగడ నివాసంలో ఈ భేటీ జరిగింది. వారిద్దరు గంట సేపు మంతనాలు జరిపారు.

Ex JD Lakshminarayana meets Mudragada Padmanabham
Author
Kirlampudi, First Published Sep 21, 2019, 10:25 AM IST

కాకినాడ: సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మినారాయణ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంతో భేటీ అయ్యారు. తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలోని ముద్రగడ పద్మనాభం నివాసంలో ఈ భేటీ జరిగింది. 

లక్ష్మినారాయణ కోసం ముద్రగడ అల్పాహార విందు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత గంట సేపు ఇద్దరి మధ్య చర్చలు జరిగాయి. రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై వారు చర్చించుకున్నట్లు తెలుస్తోంది. అయితే, జనసేనలో లక్ష్మినారాయణ అంత చురుగ్గా పాల్గొనడం లేదు.

జనసేన నుంచి లక్ష్మినారాయణ తప్పుకుంటారనే వార్తలు కూడా వచ్చాయి. అయితే, ఆ వార్తలను ఆయన ఖండించారు. తాజాగా ముద్రగడ పద్మనాభం తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని విమర్శిస్తూ ఓ బహిరంగ లేఖ రాశారు. 

శాసనసభ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు అంతిమ యాత్రలో చంద్రబాబు ఇచ్చిన సంకేతాలను విమర్శిస్తూ ఆయన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో వారిద్దరి మధ్య భేటీ రాజకీయంగా ప్రాధాన్యాన్ని సంతరించుకుందని భావిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios