ఉమ్మడి ఏపీ మాజీ సీఎస్ ఎస్వీ ప్రసాద్ కుటుంబంలో మరో విషాదం చోటు చేసుకుంది. కరోనాతో ఎస్వీ ప్రసాద్ మృతి చెంది ఒక్కరోజు కూడా గడవక ముందే ఆయన సతీమణి లక్ష్మి సైతం చనిపోయారు. ఈ వేకువజామున 3 గంటలకి ఆమె తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

కొద్దిరోజుల క్రితం ఎస్వీ ప్రసాద్ తో పాటు ఆయన భార్య లక్ష్మి, ఇద్దరు కుమారులు వర్థన్, శైలేష్ కొవిడ్ బారిన పడ్డారు. తొలుత భార్యభర్తలు సోమాజి గూడలోని ఓ ఆస్పత్రిలో చేరారు. తర్వాత ఇద్దరు కొడుకులు కూడా అదే ఆస్పత్రిలో చేరారు.

పరిస్థితి విషమించడంతో మంగళవారం ఎస్వీ ప్రసాద్, బుధవారం వేకువ జామున లక్ష్మి మృతి చెందారు. ఇద్దరు కుమారుల ఆరోగ్యం నిలకడగా ఉంది. 

కరోనా సోకి.. మాజీ సీఎస్ ఎస్వీ ప్రసాద్ కన్నుమూత...

కాగా, మంగళవారం మాజీ సీఎస్ ఎస్వీ ప్రసాద్ కన్నుమూశారు. కొద్ది రోజుల క్రితం ఆయన కరోనా బారినపడ్డారు. కాగా.. ఈ క్రమంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఎంఐఎం అహ్మదాబాద్ లో ఎంబీఏ పూర్తి చసిన ఆయన 1975 ఐఏఎస్ బ్యాక్ కు చెందిన అధికారి కావడం గమనార్హం.

నెల్లూరు జిల్లా సబ్ కలెక్టర్ గా ఎస్వీ ప్రసాద్ తన కెరిర్ ని ప్రారంభించారు. అనంతరం 1982లో కడప, 1985లో విశాఖపట్నం జిల్లాల కలెక్టర్ గా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత పలు ప్రభుత్వ శాఖలు, విభాగాలకు ఛైర్మన్ గా వ్యవహరించారు. అంతేకాకుండా... పలు శాఖలకు కార్యదర్శి, ముఖ్యకార్యదర్శి స్థాయి నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థాయి వరకు ఆయన ఎదిగారు.