Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబు ప్రత్యర్థి, వైసీపీ కుప్పం ఇంచార్జి చంద్రమౌళి మృతి!

ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నియోజకవర్గం, కుప్పం వైసీపీ ఇంచార్జి గా కొనసాగుతున్న మాజీ ఐఏఎస్ అధికారి చంద్రమౌళి మరణించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే.

ex bureaucrat, Chandrababu's Opponent and YCP kuppam incharge chandramouli passes away
Author
Hyderabad, First Published Apr 17, 2020, 11:31 PM IST

ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నియోజకవర్గం, కుప్పం వైసీపీ ఇంచార్జి గా కొనసాగుతున్న మాజీ ఐఏఎస్ అధికారి చంద్రమౌళి మరణించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈయన 2019 ఎన్నికల్లో కూడా నేరుగా ప్రచారం చేయలేదు. ఆయన శుక్రవారం రోజు సాయంత్రం హైదరాబాద్ లో మరణించారు. 

గత రెండు దఫాల్లో ఆయన చంద్రబాబు నాయుడు మీద వైసీపీ తరుపున కుప్పం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 

1990 బ్యాచ్ కి చెందిన ఈ ఐఏఎస్ అధికారి సూపర్ ఆనుయేషన్ తరువాత సిడిఎస్ గా రాజీనామా చేసి వైసీపీలో చేరారు. ఆయన తొలిసారి 2014లో చంద్రబాబు నాయుడుపై పోటీకి దిగి ఓడిపోయారు. 

చంద్రమౌళికి కుప్పం టికెట్ ఇవ్వడానికి కారణం లేకపోలేదు. కుప్పం నియోజకవర్గంలో, ఒకమాటకొస్తే చిత్తూర్ జిల్లా అంతటా బలమైన ఒక బీసీ సామాజికవర్గానికి చెందిన నేత. అంతే కాకుండా ఈయన తమిళంలోనూ అనర్గళంగా మాట్లాడగలడు. 

కుప్పం నియోజకవర్గంలో తమిళం మాట్లాడేవారు చాలామందే ఉంటారు. వారందరినీ కూడా తమవైపుగా తిప్పుకోవచ్చని భావించిన వైసీపీ ఈయనకు టికెట్ ఇచ్చింది. ఈయన గతంలో కడప జిల్లా కలెక్టర్ గా కూడా పనిచేసారు. 

చంద్రమౌళి మృతికి పలువురు ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియజేసారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు సహా పలువురు నేతలు ఆయన మృతికి సంతాపం తెలుయజేసారు.   
 

Follow Us:
Download App:
  • android
  • ios