విజయవాడలో యాంకర్ల అసభ్య నృత్యాలు.. మద్యం బాటిల్స్, కండోమ్ ప్యాకెట్లు

event anchors obscene dances in vijayawada.. police arrested 50 people
Highlights

పార్టీ జరుగుతున్న ప్రాంతంలో పెద్ద ఎత్తున మద్యం, కండోమ్ ప్యాకెట్లు లభ్యమయ్యాయి. ప్రతినెలా ఇదే తరహాలో నగరంలో పార్టీలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
 

విజయవాడలో ఈవెంట్ యాంకర్ల అసభ్య నృత్యాలు కలకలం రేపాయి. అధికార పార్టీకి చెందిన ఓ కీలకనేత  ఆధ్వర్యంలోనే ఈ పార్టీ జరిగినట్లు సమాచారం. పూర్తి వివరాల్లోకి వెళితే.. బుధవారం సాయంత్రం విజయవాడలోని  భవానీపురంలో ఉన్న ఆలీవ్ ట్రీ హోటల్‌పై బుధవారం అర్ధరాత్రి పోలీసులు దాడి చేశారు. మహిళలతో అసభ్య నృత్యాలు నిర్వహిస్తున్నారనే సమాచారంతో పోలీసులు రైడ్‌ చేసి.. ఐదుగురు మహిళలు, 50మంది పురుషులను అదుపులోకి తీసుకున్నారు.

హైదరాబాద్‌కు చెందిన కొందరు ప్రైవేట్ ఈవెంట్ యాంకర్లను తీసుకువచ్చి హోటల్‌లో అసభ్య నృత్యాలు నిర్వహించారని సమాచారం.ఈ ఘటనలో పట్టుబడిన వారిలో 10 మందిని వన్ టౌన్ పోలీస్‌ స్టేషన్‌కు, 15 మందిని భవానీపురం పీఎస్‌కు, 10 మందిని ఇబ్రహీంపట్నం పీఎస్‌కు, మరో పదిమందిని గవర్నర్‌పేట పీఎస్‌కు తరలించారు.

ఐదుగురు యువతులను వాసవ్య మహిళా మండలికి అప్పగించారు. పట్టుబడిన యువతులు హైదరాబాద్, భీమవరం, విహయవాడకు చెందిన వారిగా గుర్తించారు.పార్టీ జరుగుతున్న ప్రాంతంలో పెద్ద ఎత్తున మద్యం, కండోమ్ ప్యాకెట్లు లభ్యమయ్యాయి. ప్రతినెలా ఇదే తరహాలో నగరంలో పార్టీలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
 

loader