అనంతపురం: మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడి ఎస్కార్ట్‌ పోలీస్ వాహనం బోల్తా పడింది. ఈ సంఘటన బుధవారం జరిగింది. చంద్రబాబునాయుడు అనంతపురం జిల్లా పర్యటన సందర్భంగా ఎస్కార్టు పోలీస్ వాహనాన్ని ఏర్పాటుచేశారు. 

చంద్రబాబు పర్యటన ముగించుకుని వస్తున్న సమయంలో పెనుకొండ మండలం వెంకటరెడ్డిపల్లి సమీపంలోగల జాతీయ రహదారిపై ఎస్కార్టు వాహనం బోల్తా కొట్టింది. 

ఈ ప్రమాదంలో వాహనంలోని సాయుధ రిజర్వు ఎస్‌ఐ రామాంజనేయులు, ఏఆర్‌ సీసీ విజయ్‌కుమార్‌కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.