తప్పుడు ప్రేమతో పిచ్చివాడినయ్యాను.. : విజయవాడలో సూసైడ్ నోట్ రాసి బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
విజయవాడలో ఓ బీటెక్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర కలకలం రేపుతోంది. అయితే ఆత్మహత్యకు ముందు రాసిన సూసైడ్ నోట్‌లో అతడు పలు విషయాలను ప్రస్తావించాడు.

విజయవాడలో ఓ బీటెక్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర కలకలం రేపుతోంది. అయితే ఆత్మహత్యకు ముందు రాసిన సూసైడ్ నోట్‌లో అతడు పలు విషయాలను ప్రస్తావించాడు. తాను ఓ యువతిని ప్రేమించి మోసపోయానని లేఖలో పేర్కొన్నాడు. ఆ యువతి చేతిలో తనలా మోసపోయిన వారికి న్యాయం చేయవాలని కోరాడు. వివరాలు.. బీటెక్ చదువుతున్న అబ్దుల్ సలామ్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఆత్మహత్యకు ముందు రాసిన లేఖలో.. ఓ యువతి తనను ప్రేమ పేరుతో మోసం చేసిందని ఆరోపించారు. ప్రియురాలి మోసాన్ని భరించలేక తల్లిదండ్రులకు ఏం చెప్పాలో తెలియక ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా చెప్పారు.
ఆమె తప్పుడు ప్రేమతో తాను పిచ్చివాడయ్యానని.. జీవితంపై విరక్తి చెందానని చెప్పాడు. ఆమె తనతో ప్రేమలో ఉన్నట్లు నటిస్తోందని.. పెళ్లయిన లెక్చరర్ తో రిలేషన్ షిప్ కొనసాగిస్తోందని లేఖలో పేర్కొన్నాడు. రాత్రి వేళల్లో ఆమె వేరొకరితో వీడియో కాల్స్ చేసిందని ఆరోపించాడు. ఆమె ప్రవర్తనను మార్చేందుకు ఎంతగా ప్రయత్నించిన మారలేదని పేర్కొన్నాడు. ఆమె చేతిలో మోసపోయిన అమాయక కుర్రాళ్లకు న్యాయం చేయాలని అబ్దుల్ సలామ్ లేఖలో రాశాడు. ఇక, ఈ ఘటనపై ఈ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.