అమరావతి: రాజధాని భూమి కొనుగోలు వ్యవహారంలో మనీలాండరింగ్ జరిగిందనే అనుమానంతో సీఐడీ రాసిన లేఖపై   ఈడీ  అధికారులు సోమవారం నాడు కేసు నమోదు చేశారు.

అమరావతిలో భూముల కొనుగోలులో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఏపీ ప్రభుత్వం ఆరోపించింది. ఈ విషయమై సీఐడీ విచారణను ప్రారంభించింది. 796 మంది తెల్ల రేషన్ కార్డు దారులు  అమరావతిలో భూములు కొనుగోలు చేసినట్టుగా సీఐడీ గుర్తించింది.

Also read:అమరావతి భూముల కొనుగోలులో మనీ లాండరింగ్?: దర్యాప్తుకు ఈడీకి సీఐడీ లేఖ

అమరావతిలో భూముల కొనుగోలు వ్యవహారంలో మనీ లాండరిగంగ్ జరిగిందని  సీఐడీ అనుమానాలు వ్యక్తం చేసింది.ఈ విషయమై విచారణ దర్యాప్తు చేయాలని సీఐడీ అధికారులు  ఈడీకి లేఖ రాశారు. సీఐడీ లేఖ ఆధారంగా  ఎన్‌పోర్స్‌మెంట్ అధికారులు  సోమవారం నాడు కేసు నమోదు చేసింది.

రాజధాని ప్రాంతంలో సుమారు 4 వేల  ఎకరాల భూమిని టీడీపీకి చెందిన నేతలు కొనుగోలు చేశారని  అసెంబ్లీలో ఏపీ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రకటించారు. టీడీపీకి చెందిన ప్రజా ప్రతినిధులు, ఆ పార్టీ నేతలు, వారి సన్నిహితులు, కుటుంబసభ్యులు, బంధువుల పేర్లతో భూములు కొనుగోలు చేశారని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి  అసెంబ్లీలో ప్రకటించారు.

అమరావతిలో సుమారు 796 మంది తెల్ల రేషన్ కార్డుదారులు భూములు కొనుగోలు చేశారని  సీఐడీ గుర్తించింది. వీరికి నోటీసులు జారీ చేసింది. మరో వైపు ఈ భూముల కొనుగోలు వ్యవహారంలో బినామీలు కీలకంగా వ్యవహరించారని సీఐడీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది.ఈ విషయంలో  మనీ లాండరింగ్ పాత్ర పోషించిందని భావిస్తోంది.

సీఐడీ వినతి మేరకు ఈడీ సోమవారం నాడు కేసు నమోదు చేసింది. ఈడీ అధికారులు రంగంలోకి దిగడంతో భూముల కొనుగోలుకు సంబంధించి డబ్బులు ఎలా వచ్చాయనే దానిపై  కూడ  ఈడీ అధికారులు విచారణ చేయనున్నారు.