విజయవాడ:
సీనియర్  అసిస్టెంట్ కృపావరం తనను లైంగికంగా వేధిస్తున్నారంటూ దేవాదాయ శాఖ మహిళా ఉద్యోగి జ్యోతి దేవాదాయ శాఖ కమిషనర్ కు ఫిర్యాదు చేసింది. గత కొంతకాలంగా కృపావరం లైంగికంగా వేధిస్తున్నాడని ఈ విషయాన్ని మంత్రి కేఈ కృష్ణమూర్తి దృష్టికి సైతం తీసుకెళ్లినట్లు తెలిపారు.

అయితే మంత్రి కేఈ పట్టించుకోకపోవడంతో కృపావరం ఆగడాలు ఎక్కువ అయ్యాయని ఆమె వాపోయారు. దీంతో జ్యోతి దేవాదాయ శాఖ కమిషనర్ పద్మ దృష్టికి తీసుకెళ్లారు. కృపావరంపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.  కృపావరం ఏన్జీవో నేత కావడంతో ఉన్నతాధికారులు సైతం  పట్టించుకోవడం లేదన్నారు. పట్టించుకోకపోగా రాజీ చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయం చెయ్యాలని డిమాండ్ చేశారు.