నంద్యాల ప్రారంభం అయిన ఇరు పార్టిల మాటల యుద్దం. ముఖ్యమంత్రి గురువారం ప్రచారం ఖరారు. వైసీపి అధినేత జగన్ బుధవారం ప్రచారం.

తెలుగు దేశం పార్టి, వైకాపా మాట‌ల హోరు నంద్యాల్లో ముగిసింది, కాకినాడలో ప్రారంభమైంది, నిన్నటితో నంద్యాల్లో ప్రచారం ముగిసింది, అక్క‌డ నేతలు ఏమీ చేసేది లేదు. ఇక ప్ర‌ధాన ఇరు పార్టిల నాయ‌కులు కాకినాడ చేరుకుంటున్నారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో మ‌రో ఐదు రోజుల కాకినాడ జ‌నాల చేవులు తుప్పు ఓదిలించేదుకు రేడి అయిపోతున్నాయి. ఇప్ప‌టికే అధికార పార్టి మంత్రుల‌, వైసీపి త‌రుపుల‌న కొంద‌రు నేత‌లు కాకినాడ‌లో గ‌త రెండు వారాల నుండి పాగా వేసి గ‌ల్లీ గ‌ల్లీ తిరిగి మ‌రీ ప్ర‌చారం చేస్తున్నారు.

ఏడేళ్ల గ్యాప్ త‌రువాత జ‌రుగుతున్న ఎన్నిక కావ‌డంతో రెండు ప్ర‌ధాన పార్టిలు గెలుపు కోసం తీవ్రంగా పోటీ ప‌డుతున్నాయి. అందులోను ఎడాదిన్న‌ర‌గా కాపులకు రిజ‌ర్వేష‌న్ పేరుతో ప్ర‌భుత్వాన్ని ముప్పుతిప్ప‌లు పెడుతున్న ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం స్వంత ఊరు కిర్లంపొడి ప‌క్క‌నే ఉండ‌టం గ‌మ‌నించాలి. అందుక‌నే ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా కాపులంద‌రు ఓట్లు వెయ్య‌మంటూ ముద్రగ‌డ ఇప్ప‌టికే పిలుపిచ్చిన సంగ‌తి అంద‌రికి తెలిసిందే. దాంతో కార్పోరేష‌న్‌లో అత్య‌ధిక ఓట‌ర్లు క‌ల్గిన కాపు సామాజిక వ‌ర్గం ఏం చేస్తుంద‌నే విష‌యం సస్పెస్స్‌. అందుకే కాకినాడ‌లో వైసీపి అధినేత జగన్ బుధ‌వారం ప్ర‌చారం చేస్తుంటే, సీఎం చంద్రబాబు గురువారం ప్ర‌చారానికి వ‌స్తున్నారు. 

మరిన్ని తాజా విశేషాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి