విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ: వర్షంలోనూ కార్మికుల నిరసన

ప్రైవేటీకరణను నిరసిస్తూ  విశాఖ స్టీల్ ప్లాంట్ ఆడ్మిన్ కార్యాలయం ముందు కార్మిక సంఘాల జేఎసీ ఆధ్వర్యంలో కార్మికులు మంగళవారం నాడు ఆందోళనకు దిగారు.వందశాతం స్టీల్‌ప్లాంట్ ను ప్రైవేటీకరిస్తామని కేంద్రం ప్రకటించింది.

Employees of Vizag steel plant stage protest

విశాఖపట్టణం: ప్రైవేటీకరణను నిరసిస్తూ విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల జేఎసీ ఆధ్వర్యంలో మంగళవారం నాడు కార్మికులు ఆడ్మిన్ కార్యాలయం ముందు నిరసనకు దిగారు.విశాఖస్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ కార్మిక సంఘాల జేఎసీ ఆధ్వర్యంలో కార్మికులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. వర్షం వస్తున్నా కూడ కార్మిక సంఘాలు ఆందోళనలు కొనసాగిస్తున్నాయి.  స్టీల్ ప్లాంట్ లోని అన్ని విభాగాల్లోకి ఉద్యోగులు వెళ్లకుండా కార్మికులు అడ్డుకొన్నారు. 

విశాఖ స్టీల్ ప్లాంట్ ను వంద శాతం ప్రైవేటీకరిస్తామని కేంద్ర ప్రభుత్వం లోక్‌సభ వేదికగా ప్రకటించింది. అయితే ప్రైవేటీకరణను అడ్డుకొంటామని కూడ కార్మిక సంఘాల జేఎసీ ప్రకటించింది.

కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మికులు నినాదాలు చేశారు. ప్రైవేటీకరణను వెంటనే విరమించుకోవాలని కార్మికులు కేంద్రాన్ని డిమాండ్ చేశారు.స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వైసీపీ, బీజేపీ సహా అన్ని పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కానీ ప్రైవేటీకరణ ఆగదని కూడ కేంద్రం తేల్చి చెప్పింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios