Asianet News TeluguAsianet News Telugu

అనంతపురంలోని కియా ప్లాంట్‌లో కరోనా కలకలం: ఓ ఉద్యోగికి పాజిటివ్

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కోరలు చాస్తోంది. తాజాగా అనంతపురం జిల్లాలో ఉన్న కియా కార్ల తయారీ పరిశ్రమలో కోవిడ్ 19 కలకలం రేపింది. ఈ ఫ్లాంట్‌లోని బాడీ షాప్‌లో పనిచేస్తున్న ఓ ఉద్యోగికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది

employee got corona positive in kia plant in anantapuram
Author
Anantapur, First Published Jun 4, 2020, 3:36 PM IST

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కోరలు చాస్తోంది. తాజాగా అనంతపురం జిల్లాలో ఉన్న కియా కార్ల తయారీ పరిశ్రమలో కోవిడ్ 19 కలకలం రేపింది. ఈ ఫ్లాంట్‌లోని బాడీ షాప్‌లో పనిచేస్తున్న ఓ ఉద్యోగికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.

Also Read:రాజధాని గ్రామాల్లో కరోనా కలకలం... వాలంటీర్ కు పాజిటివ్

బాధితుడు తమిళనాడు వాసిగా తెలుస్తోంది. వైద్య పరీక్షల అనంతరం అతనిని ప్లాంట్ నుంచి అనంతపురంలోని కృష్ణదేవరాయ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. ఈ ఘటనను ధ్రువీకరిస్తూ కియా సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది.

కరోనా నేపథ్యంలో మంత్రి శంకరనారాయణ కియా ప్రతినిధులతో భేటీ అయ్యారు. కంపెనీలోని ప్రతి ఒక్కరికి పరీక్షలు నిర్వహించిన అనంతరమే విధుల్లోకి తీసుకోవాలని ఆయన కియా యాజమాన్యానికి సూచించారు. 

మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తికి అంతు లేకుండా ఉంది. ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నవారి వల్ల ఏపీలో కోవిడ్-19 పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా గత 24 గంటల్లో 141 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కరోనా వైరస్ సోకినవారిలో 43 మంది ఇతర రాష్ట్రాలకు చెందినవారు ఉన్నారు. 19 కేసులు చెన్నై కోయంబేడు లింకులున్న కేసులు కావడం గమనార్హం.

Also Read:ఏపీలో కరోనా విజృంభణ: 3377కు చేరుకున్న పాజిటివ్ కేసులు, 71 మరణాలు

తాజా కేసులతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3377కు చేరుకున్నాయి. తాజాగా గత 24 గంటల్లో కరోనా వైరస్ కారణంగా ముగ్గురు మరణించారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 71కి చేరుకుంది. గుంటూరు, కృష్ణా, కర్నూలు జిల్లాల్లో గత 24 గంటల్లో ఒక్కరేసి కోవిడ్-19తో మరణించారు. 

రాష్ట్రంలో 1033 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు 2273 మంది కరోనా వైరస్ నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 
గత 24 గంటల్లో 9,986 శాంపిల్స్ ను పరీక్షించగా 98 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. గత 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 29 మంది డిశ్చార్జీ అయ్యారు. 

విదేశాల నుంచ్ి వచ్చినవారిలో 119 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది వారిలో ఈ రోజు ముగ్గురు ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. యాక్టివ్ కేసులు 115 ఉన్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి వారిలో 616 మందికి కరోనా వైరస్ ఉన్నట్లు తేలింది. ఇందులో ఈ రోజు 33 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జీ అయ్యారు. యాక్టివ్ కేసులు 372 ఉన్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios