రాజధాని గ్రామాల్లో కరోనా కలకలం... వాలంటీర్ కు పాజిటివ్

ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా మహమ్మారి రోజురోజుకు మరింత విజృంభిస్తోంది. ఇలా ఇంతకాలం ప్రభుత్వాన్ని కలవరపెట్టిన ఈ వైరస్ తాజాగా ప్రభుత్వ యంత్రాగాన్ని బెంబేలెత్తిస్తోంది. 

Village Volunteer infected by coronavirus

తాడేపల్లి: ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా మహమ్మారి రోజురోజుకు మరింత విజృంభిస్తోంది. ఇలా ఇంతకాలం ప్రభుత్వాన్ని కలవరపెట్టిన ఈ వైరస్ తాజాగా ప్రభుత్వ యంత్రాగాన్ని బెంబేలెత్తిస్తోంది. ఇప్పటికే చాలామంది ప్రభుత్వోద్యుగులు ఈ వైరస్ బారిన పడగా తాజాగా మరో ఉద్యోగికి కరోనా సోకినట్లు  నిర్దారణ అయ్యింది. 

గుంటూరు జిల్లా ఉండవల్లిలో వాలంటీర్ గా పనిచేస్తున్న ఓ యువకుడు కరోనా బారిన పడ్డాడు. అతడికి పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ గా తేలింది. దీంతో ఒక్కసారిగా రాజధాని ప్రాంతంలో కలకలం మొదలయ్యింది. 

దీంతో ఉండవల్లి గ్రామం ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా సిబ్బంది శానిటేషన్ చేపట్టారు. రాజధాని గ్రామాలలో కరోనా కేసులు క్రమంగా విస్తరిస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే నవులూరు, పెనుమాక గ్రామాలలో కరోనా పాజిటివ్ కేసులు నమోదయిన విషయం తెలిసిందే. 

read more   నిన్న సచివాలయం, నేడు విద్యుత్ సౌధ... ప్రభుత్వ కార్యాలయాల్లో కరోనా కలకలం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తికి అంతు లేకుండా ఉంది. ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నవారి వల్ల ఏపీలో కోవిడ్-19 పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా గత 24 గంటల్లో 141 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కరోనా వైరస్ సోకినవారిలో 43 మంది ఇతర రాష్ట్రాలకు చెందినవారు ఉన్నారు. 19 కేసులు చెన్నై కోయంబేడు లింకులున్న కేసులు కావడం గమనార్హం.

తాజా కేసులతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3377కు చేరుకున్నాయి. తాజాగా గత 24 గంటల్లో కరోనా వైరస్ కారణంగా ముగ్గురు మరణించారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 71కి చేరుకుంది. గుంటూరు, కృష్ణా, కర్నూలు జిల్లాల్లో గత 24 గంటల్లో ఒక్కరేసి కోవిడ్-19తో మరణించారు. 

రాష్ట్రంలో 1033 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు 2273 మంది కరోనా వైరస్ నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గత 24 గంటల్లో 9,986 శాంపిల్స్ ను పరీక్షించగా 98 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. గత 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 29 మంది డిశ్చార్జీ అయ్యారు. 

విదేశాల నుంచి వచ్చినవారిలో 119 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది వారిలో ఈ రోజు ముగ్గురు ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. యాక్టివ్ కేసులు 115 ఉన్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి వారిలో 616 మందికి కరోనా వైరస్ ఉన్నట్లు తేలింది. ఇందులో ఈ రోజు 33 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జీ అయ్యారు. యాక్టివ్ కేసులు 372 ఉన్నాయి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios