Asianet News TeluguAsianet News Telugu

ఏలూరు వేగివాడలో తల్లీ కూతుళ్ల సూసైడ్: పెదవేగి ఎస్ఐ పై సస్పెన్షన్ వేటు

పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి ఎస్ఐ సత్యనారాయణను  సస్పెండ్ చేశారు డీఐజీ, తన విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు సస్పెండ్ చేశారు డీఐజీ.
 

Eluru Range DIG Suspends pedavegi SI Satyanarayana
Author
First Published Sep 25, 2022, 12:33 PM IST

ఏలూరు: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా  పెదవేగి ఎస్ఐ సత్యనారాయణను డీఐజీ సస్పెండ్ చేశారు.  విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు ఎస్ఐ సత్యనారాయణను డీఐజీ సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
పెద్దవేగి మండలం వేగివాడలో తల్లీ కూతుళ్లు రోజుల వ్యవధిలో చనిపోయారు. ఎస్ఐ సత్యనారాయణ తన విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడగం వల్లే ఈ ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారని మృతుల కుటుంబం ఆరోపించింది.  పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు మృతుల బంధువులు. 

also read:ఏలూరు వేగివాడలో తల్లీ కూతుళ్ల ఆత్మహత్య: పోలీసులపై బంధువుల ఆరోపణలు

ఈ నెల 12వ తేదీన మైనర్ బాలికను చిట్టిబాబు తీసుకెళ్లాడు . ఈ విషయమై బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే అదే రోజున మైనర్ బాలికతో పాటు ఆమెను తీసుకెళ్లిన యువకుడిని పోలీసుస్టేషన్ ను తీసుకు వచ్చారు పోలీసులు. అయితేఈ విషయమై బాధిత కుటుంబం పిర్యాదు చేసినా కూడా  పోలీసులు కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని బాధిత కుటుంబం ఆరోపిస్తుంది. అంతేకాదు తమను అవమానించేలా ఎస్ఐ మాట్లాడారని బాధిత కుటుంబం చెబుతుంది. దీంతో మనోవేదనకు గురైన మైనర్ బాలిక, ఆమె తల్లి ఎలుకల మందు తాగారు.  దీంతో ఈ నెల 16వ తేదీన బాధతులను విజయవాడ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తల్లీ కూతుళ్లు మరణించారు. రెండు రోజుల వ్యవధిలో తల్లీ కూతుళ్లు మరణించారు. దీంతో  మృుతల కుటుంబ సభ్యులు ఆందోళన నిర్వహించారు. ఉద్రిక్తత చోటు చేసుకొంది.ఈ విషయమై  ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. పెదవేగి ఎస్ఐ సత్యనారాయణపై చర్యలు తీసుకొన్నారు.ఆయనపై సస్పెన్షన్ వేటేశారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారని సత్యనారాయణపై సస్పెన్షన్ వేటు పడింది. 

Follow Us:
Download App:
  • android
  • ios