Asianet News TeluguAsianet News Telugu

వింత వ్యాధికి కారణం అదే: తేల్చేసిన వైద్యులు, ఎల్లుండి స్పష్టత

ఎయిమ్స్ నిపుణుల బృందం నివేదిక ప్రకారం సీసీం, ఫెస్టిసైడ్స్ అంతుచిక్కని వ్యాధికి కారణమన్నారు ఏలూరు ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన లెడ్ నీటి ద్వారా శరీరంలోకి ప్రవేశించిన ఆనవాళ్లు కనిపించలేదన్నారు. 

eluru government hospital superintendent comments on mystery disease strikes ksp
Author
Eluru, First Published Dec 9, 2020, 4:41 PM IST

ఎయిమ్స్ నిపుణుల బృందం నివేదిక ప్రకారం సీసీం, ఫెస్టిసైడ్స్ అంతుచిక్కని వ్యాధికి కారణమన్నారు ఏలూరు ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన లెడ్ నీటి ద్వారా శరీరంలోకి ప్రవేశించిన ఆనవాళ్లు కనిపించలేదన్నారు.

అయితే లెడ్, పెస్టిసైడ్స్ అవశేషాలు శరీరంలోకి ఎలా ప్రవేశించాయనేది తేలాల్సి వుందన్నారు. సీసీఎంబీ రిపోర్ట్ వారంలోగా వస్తాయని సూపరింటెండెంట్ తెలిపారు. శుక్రవారం తర్వాత ఈ వ్యాధికి పూర్తి కారణాలు తెలుస్తాయని ఆయన పేర్కొన్నారు.

ప్రస్తుతం కేసులు తగ్గాయని, ప్రాణభయం లేదని సూపరింటెండెంట్ చెప్పారు. ఇది ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిన వ్యాధి కాదని ఆయన స్పష్టం చేశారు. 

అంతకుముందు ఏలూరులో అంతు చిక్కని వ్యాధిపై ఏపీ సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహిస్తున్నారు. బుధవారం జిల్లా కలెక్టర్, వైద్యాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు జగన్.

కేసుల వివరాలను ఆయన ఆరా తీశారు, అలాగే రోగులకు అందిస్తున్న చికిత్సపైనా అడిగి తెలుసుకున్నారు. మరోవైపు మళ్లీ కొత్త కేసులు నమోదు కావడం , ఆందోళన కలిగిస్తోంది.

తంగెళ్లమూడి, తూర్పువీధి, పడమట వీధి, శంకరమఠం ప్రాంతాల నుంచి ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య రోజు రోజుకి ఎక్కువవుతోంది. వీరిలో కొందరికి ఒకేసారి ఫిట్స్‌లా వచ్చిందని బంధువులు చెబుతున్నారు.

అంతుచిక్కని వ్యాధికి సంబంధించి ఎయిమ్స్ నివేదిక కీలకంగా మారింది. ఇప్పటికే రెండు సార్లు సేకరించిన శాంపిల్స్‌లో నికెల్, సీసం లోహాలు వున్నట్లు గుర్తించారు. మూడోసారి 30 మంది నుంచి శాంపిల్స్ సేకరించారు.

ఇందుకు సంబంధించిన నివేదిక ఈరోజు రానుంది. శరీరంలోకి నికెల్, సీసం లోహాలు ఎలా వచ్చాయన్న కోణంలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తోంది ఎయిమ్స్ బృందం. వీరితో పాటు ఎన్ఐఎన్, డబ్ల్యూహెచ్ఓ బృందం కూడా పర్యటిస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios