చిత్తూరు జిల్లాలో ఏనుగుల గుంపు హల్‌చల్: మొసలిమడుగు వద్ద రోడ్డుపై రాకపోకలకు అంతరాయం

చిత్తూరు జిల్లాలోని పలమనేరుకు సమీపంలో  మొసలిమడుగు వద్ద  బుధవారంనాడు  ఉదయం  ఏనుగుల గుంపు రోడ్డుపైకి  వచ్చింది.  దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 

Elephant herd obstrucked  transport  in Chittoor district

చిత్తూరు: చిత్తూరు: జిల్లాలోని  పలమనేరుకు సమీపంలో మొసలిమడుగు వద్ద  బుధవారం నాడు ఉదయం ఏనుగుల  గుంపు హల్ చల్ చేసింది. రోడ్డుపైనే ఏనుగులు తిరిగాయి.  దీంతో  రాకపోకలకు  తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ విషయం తెలిసిన  అటవీశాఖాధికారులు   రోడ్డుపైకి వచ్చిన ఏనుగుల గుంపును  అటవీశాఖాధికారులు  అడవిలోకి పంపారు. ట్రాక్టర్ సహయంతో  ఏనుగుల గుంపును  అడవిలోకి పంపారు.

అటవీ ప్రాంతంలో  దారితప్పి   ఏనుగుల గుంపు జవాసాల మధ్యకు వచ్చినట్టుగా అటవీశాఖాధికారులు  అనుమానిస్తున్నారు.  రాష్ట్రంలోని  చిత్తూరు జిల్లాతో పాటు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో  ఏనుగుల గుంపులు తరచూ సంచరిస్తున్నాయి. సమీపంలోని అటవీ ప్రాంతాల నుండి ఏనుగులు ఆహారం లేదా నీటి కోసం  జనావాసాలకు వస్తున్నట్టుగా  ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు.  అంతేకాదు ఈ జిల్లాల్లోని పంట పొలాలను ఏనుగులు ధ్వంసం చేస్తున్న ఘటనలు కూడా లేకపోలేదు.  ఏనుగుల నుండి తమ పంట పొలాలను కాపాడాలని  రైతులు అటవీశాఖాధికారులను కోరుతున్నారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios