ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో కీలక నేత పార్టీని వీడి వైసీపీలో చేరారు.


ఏపీలో బీజేపీకి ఊహించని షాక్ తగిలింది. ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో కీలక నేత పార్టీని వీడి వైసీపీలో చేరారు. బీజేపీ రాష్ట్ర మజ్దూర్‌ మోర్చా కార్యవర్గ సభ్యుడు కోరాడ సత్యనారాయణ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. విజయనగరానికి చెందిన కోరాడ.. చాలా ఏళ్లుగా బీజేపీలో కొనసాగుతున్నారు.

కాగా.. పార్టీలో తగిన గుర్తింపు రావడం లేదని అసంతృప్తి చెంది వైసీపీ కండువా కప్పుకున్నారు. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకర రెడ్డి సమక్షంలో కోరాడ సత్యనారాయణ వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా కోరాడ మాట్లాడుతూ రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలంటే జగన్‌ అధికారంలోకి రావాలన్నారు.