Elections 2024: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని పలు నియోజకవర్గాల్లో పోలింగ్ ముగిసింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో పోలింగ్ ముగిసింది. తెలంగాణ రాష్ట్రంలోని 5 లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని 13 అసెంబ్లీ సెగ్మెంట్లలో సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగిసింది.

Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. నేడు ఏపీలోని మొత్తం 175 శాసనసభ, 25 లోక్‌సభ స్థానాల్లో, తెలంగాణలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో నేడు ఓటింగ్‌ జరుగుతోంది. మధ్యాహ్నం మూడు గంట వరకు ఏపీలో 55.49 శాతం పోలింగ్‌ నమోదు కాగా, తెలంగాణలో 52 శాతం  నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.  

ఇక తెలుగు రాష్ట్రాల్లోని పలు నియోజకవర్గాల్లో పోలింగ్ ముగిసింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలను అత్యంత సమస్యాత్మక ప్రాంతాలుగా ఎన్నికల కమిషన్ గుర్తించింది. ఈ పాంత్రాల్లో పోలింగ్ సమయం ముగిసింది. తెలంగాణ రాష్ట్రంలోని 5 లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని 13 అసెంబ్లీ సెగ్మెంట్లలో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిసింది.  అత్యంత సమస్యాత్మక ప్రాంతాలైన ఆసిఫాబాద్‌, సిర్పూర్‌, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, మంథని, భూపాలపల్లి, ములుగు, భద్రాచలం, పినపాక, ఇల్లందు, అశ్వరావుపేట, కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ ముగిసింది.

ఏపీలో అరకు, పాడేరు, రంపచోడవరంలో పోలింగ్‌ ముగిసింది. సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ ముగిసింది.  క్యూలైన్లలో వేచి ఉన్నవారికి ఓటేసేందుకు అవకాశం ఇస్తున్నారు. ఇక మిగితా  నియోజకవర్గాల్లో సాయంత్రం 6గంటల వరకు పోలింగ్‌ జరుగనున్నది.