ఎన్నికల విధుల్లో వార్డు వాలంటీర్లను వాడొద్దని ఏపీ ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జిల్లాల కలెక్టర్లు, రిటర్నింగ్ అధికారలకు ఎన్నికల కమీషన్ ఆదేశాలు జారీ చేసింది.

ఏపీలో వార్డు వాలంటీర్లపై ఎన్నికల కమీషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల విధుల్లో వాలంటీర్లు పాల్గొనకుండా చూడాలనీ ఈసీ ఆదేశించింది. ఓటర్ కార్డుతో ఆధార్ అనుసంధానం ప్రక్రియలో వాలంటీర్లను వాడొద్దని సూచించింది. ఈ మేరకు జిల్లాల కలెక్టర్లు, రిటర్నింగ్ అధికారలకు ఎన్నికల కమీషన్ ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.