ఎలమంచిలి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 Live
అనకాపల్లి జిల్లాలోని మరో అసెంబ్లీ నియోజకవర్గం ఎలమంచిలి. ఇక్కడ 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసిపి గెలిచింది. సిట్టింగ్ ఎమ్మెల్యే ఉప్పలపాటి వెంకట రమణమూర్తి రాజు (కన్నబాబు రాజు) పై నమ్మకంతో మరోసారి ఆయననే బరిలోకి దింపారు వైసిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇక ప్రతిపక్ష కూటమి పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని జనసేనకు కేటాయించారు. దీంతో ఎలమంచిలి ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి.
ఎలమంచిలి నియోజకవర్గ రాజకీయాలు :
ఆంధ్ర ప్రదేశ్ లో అటు టిడిపి, ఇటు జనసేన రెండూ బలంగా వున్న నియోజకవర్గాల్లో ఎలమంచిలి ఒకటి. ఇక్కడ 1983 నుండి 2004 వరకు అంటే వరుసగా ఐదు అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపిదే విజయం. మొదటిసారి కెకెవి సత్యనారాయణరాజు, ఆ తర్వాత వరుసగా 1985,1989, 1994, 1999 ఎన్నికల్లో పప్పల చలపతిరావు గెలుపొందారు. ఇక 2014లో పంచకర్ల రమేష్ బాబు టిడిపి నుండి పోటీచేసి గెలిచారు.
ఇక టిడిపితో పాటు వైసిపి కూడా ఎలమంచిలిలో స్ట్రాంగ్ గానే వుంది. కాంగ్రెస్ నుండి 2004, 2009 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కన్నబాబు వైసిపిలో చేరి 2019లో పోటిచేసారు. ఇలా మొత్తంగా మూడోసారి, వైసిపి తరపున రెండోసారి ఎలమంచిలిలో గెలిచారు.
ఎలమంచిలి నియోజకవర్గ పరిధిలోని మండలాలు :
1. రాంబిల్లి
2. మునగపాక
3. అచ్యుతాపురం
4. ఎలమంచిలి
ఎలమంచిలి అసెంబ్లీ ఓటర్లు :
నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య (2019 ఎన్నికల ప్రకారం) - 1,98,556
పురుషులు - 97,940
మహిళలు - 1,00,605
ఎలమంచిలి అసెంబ్లీ ఎన్నికలు 2024 అభ్యర్థులు :
వైసిపి అభ్యర్థి :
ఎలమంచిలి నియోజకవర్గంలో వైసిపి ఎలాంటి ప్రయోగాలు చేయలేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే ఉప్పలపాటి వెంకట రమణమూర్తి రాజునే మళ్లీ బరిలో దింపింది.
జనసేన అభ్యర్థి :
ప్రతిపక్ష కూటమి అభ్యర్థిగా సుందరపు విజయ్ కుమార్ ఎలమంచిలిలో పోటీ చేస్తున్నారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ కూడా బలంగానే వున్నా పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించారు.
ఎలమంచిలి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు :
ఎలమంచిలి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024
ఎలమంచిలి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలుపొందింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ ఎన్నికల్లో వైసీపీకి చెందిన ప్రగడ నాగేశ్వరరావుపై టీడీపీకి చెందిన పంచకర్ల రమేష్ బాబు విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో పంచకర్ల రమేష్ బాబు 80,563 (50.60%) ఓట్లు సాధించగా.. ప్రగడ నాగేశ్వరరావు 72,188 (45.34%) ఓట్లు సాధించారు.
ఎలమంచిలి అసెంబ్లీ ఎన్నికలు 2019 ఫలితాలు :
నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు - 1,68,766 (85 శాతం)
వైసిపి - ఉప్పలపాటి వెంకట రమణమూర్తి రాజు - 71,934 ఓట్లు (42 శాతం) - 4,146 ఓట్ల మెజారిటీతో విజయం
టిడిపి - పంచకర్ల రమేష్ బాబు - 67,788 (40 శాతం) - ఓటమి
జనసేన పార్టీ - సుందరపు విజయ్ కుమార్ - 19,774 (11 శాతం)
ఎలమంచిలి అసెంబ్లీ ఎన్నికలు 2014 ఫలితాలు :
నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు - 1,59,218 ఓట్లు (85 శాతం)
టిడిపి - పంచకర్ల రమేష్ బాబు - 80,563 (50 శాతం) - 8,375 ఓట్ల మెజారిటీతో విజయం
వైసిపి - ప్రగడ నాగేశ్వరరావు - 72,188 (45 శాతం) - ఓటమి
- Andhra Pradesh Assembly Elections 2024
- Andhra Pradesh Congress
- Andhra Pradesh Elections 2024
- Elamanchili Assembly
- Elamanchili Politics
- Elamanchili assembly elections result 2024
- JSP
- Janasena Party
- Kannababu
- Nara Chandrababu Naidu
- Panchakarla Ramesh Babu
- Pawan Kalyan
- Sundarapu Vijay Kumar
- TDP
- TDP Janasena Alliance
- TDP Janasena BJP
- Telugu Desam party
- Telugu News
- UVR Raju
- Uppalapati Venkata Ramanamurthy Raju
- YCP
- YS Jaganmohan Reddy
- YSR Congress Party
- YSRCP