నిరుద్యోగం యువతను మానసికంగా కృంగదీస్తుంది. ఎంత చదువుకున్నా చదువుకు తగ్గ ఉద్యోగాలు దొరకకపోతే ఇబ్బందే. అందుకే డిగ్రీలు, పీజీలు చేసినవారు కూడా పదో తరగతి అర్హత కలిగిన ఉద్యోగాలకు ఎగబడుతున్నారు. అలాంటి ఘటనే ఆంధ్రప్రదేశ్ లో జరిగింది.
నిరుద్యోగం యువతను మానసికంగా కృంగదీస్తుంది. ఎంత చదువుకున్నా చదువుకు తగ్గ ఉద్యోగాలు దొరకకపోతే ఇబ్బందే. అందుకే డిగ్రీలు, పీజీలు చేసినవారు కూడా పదో తరగతి అర్హత కలిగిన ఉద్యోగాలకు ఎగబడుతున్నారు. అలాంటి ఘటనే ఆంధ్రప్రదేశ్ లో జరిగింది.
రాజమహేంద్రవరం : ఉద్యోగ ప్రకటనల కోసం విద్యావంతులు ఎంత నిరీక్షిస్తున్నారో తెలియాలంటే తాజాగా పడిన ఓ చిన్న పోస్టుకు ఎంతమంది దరఖాస్తు చేసుున్నారో తెలిస్తే అర్థమవుతుంది. పోస్టుమార్టం గదిలో వైద్యుడికి సహాయకుడిగా ఉండేందుకు పడిన ఓ చిన్న పోస్టుకు నిరుద్యోగులు వందల సంఖ్యలో చేసుకున్న దరఖాస్తులే సాక్ష్యంగా నిలుస్తాయి. ఈ పోస్టులకు పదో తరగతి విద్యార్హత. ఏడాదిపాటు ఒప్పంద ప్రాతిపదికన పని చేయాలి. రూ.15 వేల వరకు జీతం ఇస్తారు. ఈ ఉద్యోగాల కోసం డిగ్రీ, పీజీ చదివిన వారూ పోటీపడుతున్నారు.
తూర్పుగోదావరి జిల్లాలోని వైద్యవిధాన పరిషత్ ఆస్పత్రుల్లో నాలుగో తరగతి ఉద్యోగుల ఎంపికలో భాగంగా చేపట్టిన పోస్టుమార్టం సహాయకుల పోస్టుల కోసం 150 మందికిపైగా పట్టభద్రులు, ఆపై చదివిన వారు దరఖాస్తు చేసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 25 పోస్టులకు మొత్తం 250 మందికి పైగా పోటీ పడుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రిల్లోని శవాగారాల్లో మృతదేహాలకు వైద్యులు పోస్టుమార్టం చేయడానికి మీరు సహాయం చేస్తారు. శరీర భాగాలను కోయడం, పోస్టుమార్టం పూర్తయ్యాక వాటికి కుట్లు వేయడం వంటివి వారి విధులు.
ఇదిలా ఉండగా, ఇటీవల కాలంలో చదువులకు చేసే ఉద్యోగాలకు సంబంధం ఉండడం లేదు. ఏ మేనేజ్మెంట్ కోర్సు చదివి మరే రంగంలోనో ఉద్యోగం చేస్తున్నారు. కొందరు టెక్నాలజీ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి సంబంధం లేని ఇతర రంగంలో కి వెళ్తున్నారు. ఉదాహరణకు ఇటీవల కాలంలో బీటెక్ చేసి.. బ్యాంకు ఉద్యోగాల్లో చేరిన వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఇదే కాక మరో తేడా కూడా ఉద్యోగాలు చేస్తున్న వారిలో కనిపిస్తుంది. వృత్తి ఒకటి ప్రవృత్తి మరొకటి.. ఈ రెండు ఒకటే అయితే వారికి అసంతృప్తి చాలావరకు ఉండదని చెప్పవచ్చు. అందుకే హర్యానాకు చెందిన ఇద్దరు ఇంజనీర్లు తమ వృత్తిని వదులుకొని ఇష్టమైన రంగంలో రంగప్రవేశం చేశారు.
ఉదయం తొమ్మిది గంటలకు ఆఫీసుకు వెళ్లి 5 గంటల వరకు జాబ్ చేసి మళ్ళీ ఇల్లు చేరడం.. రోజు ఇదే పని రాకూడదని అనుకున్నారు. వారికి ఇష్టమైన ఫుడ్ బిజినెస్ లోకి ఎంటర్ అయ్యారు. వారిద్దరూ కలిసి బిర్యానీ అమ్ముకుంటున్నారు. తమకు ఇష్టమైన పనిలో ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నామని చెబుతున్నారు రోహిత్ సైని, విశాల్ భరద్వాజ్ లు. సోనిపాట్ దగ్గర రోజు 9 నుంచి 5 వరకు జాబ్ చేశారు వీరిద్దరు. రుచికరమైన బిర్యాని వండి అమ్ముకోవాలని లక్ష్యంతో ఉద్యోగానికి స్వస్తి పలికారు. దీనికి ఇంజనీర్స్ వెజ్ బిర్యాని అని పేరు పెట్టారు. ఉత్తర ఢిల్లీలో షాప్ ఓపెన్ చేశారు. ఇంటర్నెట్లో వారి స్టోరీ వైరల్ అయింది. ఆయిల్ లేకుండా కేవలం వెజిటేరియన్ బిర్యానీ మాత్రమే వారు తయారు చేస్తారు.
రోహిత్ మాట్లాడుతూ.. తనకు వంట చేయడం, ఆహారంపై మక్కువ ఎక్కువ అని చెప్పారు. ఇష్టంతో ఎన్నో ఏళ్ళ కింద యూట్యూబ్ లో ప్రత్యేకంగా కుకింగ్ ఛానల్ ప్రారంభించానని వివరించారు. ఇప్పటికీ ఆ చానెల్ పని చేస్తున్నట్లు తెలిపారు. తనకు ఏ మాత్రం సమయం దొరికినా రెసిపీలు తయారు చేసి అందులో పోస్ట్ చేస్తుంటానని పేర్కొన్నారు. ఇష్టం ఉన్నప్పటికీ ఉద్యోగంలో జాయిన్ అయ్యానని వివరించారు అయితే తనలాగే ఆలోచించే మరో వ్యక్తి తన ఆఫీసులో తారసపడడం.. అప్పటినుంచి ఇద్దరిలోనూ బిజినెస్ పెట్టాలనే ఆలోచన బలడిందని తెలిపాడు.
