Asianet News TeluguAsianet News Telugu

ఆంధ్రప్రదేశ్‌లోని పలు ఆస్పత్రులలో ఈడీ తనిఖీలు..

ఆంధ్రప్రదేశ్‌లో పలు ఆస్పత్రుల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. విజయవాడలోని అక్కినేని ఉమెన్స్ హాస్పిటల్, గుంటూరులోని మంగళగిరి ఎన్నారై హాస్పిటల్‌లో ఈడీ అధికారులు సోదాలు జరుపుతున్నారు.

ED searches In Mangalagiri NRI hospital and Akkineni Women Hospital
Author
First Published Dec 2, 2022, 1:26 PM IST

ఆంధ్రప్రదేశ్‌లో పలు ఆస్పత్రుల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. విజయవాడలోని అక్కినేని ఉమెన్స్ హాస్పిటల్, గుంటూరులోని మంగళగిరి ఎన్నారై హాస్పిటల్‌లో ఈడీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. తనిఖీల్లో ఉన్న ఈడీ అధికారులకు కేంద్ర బలగాలతో భద్రత కల్పించారు. ఈడీ అధికారులు రెండు బృందాలుగా విడిపోయి ఎన్నారై ఆస్పత్రిలో తనిఖీలు చేపట్టారు. హాస్పిటల్‌లోని రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నారు. ఎన్నారై ఆస్పత్రి సొసైటీ సభ్యుల ఇళ్లలోనూ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇక, కోవిడ్ సమయంలో భారీగా  అవకతవకలు జరిగాయని గతంలోనే ఎన్నారై ఆస్పత్రిపై కేసు నమోదు అయింది. మాన్యువల్ రసీదులు, నకిలీ రసీదులతో నిధులు పక్కదారి పట్టించారని ఆరోపణలు కూడా వచ్చాయి. అయితే యాజమాన్య సీట్ల కేటాయింపులో అవకతవకలు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో ఈడీ సోదాలు చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.

మరోవైపు అక్కినేని ఉమెన్స్ ఆస్పత్రిలో సోదాలు నిర్వహిస్తున్న అధికారులు.. సిబ్బంది ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఆస్పత్రికి చెందిన పలువురిని ఈడీ అధికారులు ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. ఇక, అమెరికాలో వైద్యురాలుగా ఉంటున్న అక్కినేని మణి.. విజయవాడలో అక్కినేని ఉమెన్స్ హాస్పిటల్‌ను ప్రారంభించారు. విదేశీ నిధులు అక్రమంగా దారి మళ్లించారనే ఆరోపణలతో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. గతంలో మణి.. ఎన్నారై ఆస్పత్రిలో డైరెక్టర్‌గా వ్యహరించినట్టుగా తెలుస్తోంది.

Follow Us:
Download App:
  • android
  • ios