జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు: సెల్‌ఫోన్లు స్వాధీనం
తాడిపత్రి మున్సిపల్ చైర్మెన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లో ఈడీ అధికారులు శుక్రవారం నాడు ఉదయం నుండి తనిఖీలు చేస్తున్నారు. ఈ సమయంలో జేసీ సోదరులు ఇంట్లోనే ఉన్నారు.
తాడిపత్రి: Tadipatri మున్సిపల్ చైర్మెన్, టీడీపీ నేత JC Prabhakar Reddyఇంట్లో శుక్రవారం నాడు ఉదయం నుండి ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.Enforcement Directorate అధికారులు తనిఖీలు చేసే సమయంలో మాజీ మంత్రి JC Diwakar Reddy కూడా ఇంట్లోనే ఉన్నాడు. జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన సోదరుడు జేసీ దివాకర్ రెడ్డి సహా కుటుంబ సభ్యుల సెల్ ఫోన్లను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
జేసీ సోదరులకు అత్యంత సన్నిహితుడిగా ఉన్న కాంట్రాక్టర్ చవ్వా గోపాల్ రెడ్డి ఇంటిపై కూడా ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారని సమాచారం. హైద్రాబాద్ లో కూడా ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారని తెలుస్తుంది. జేసీ సోదరులకు చెందిన ఇళ్లు, కార్యాలయాల్లో కూడా ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. జేసీ సోదరులకు చెందిన కీలక పత్రాలను ఈడీ అధికారులు పరిశీలిస్తున్నారు. సుమారు 20 మందికిపైగా అధికారులు సోదాలు చేస్తున్నారు. అనంతపురం, తాడిపత్రి, హైద్రాబాద్ లలో సోదాలు చేస్తున్నారు.