నంద్యాల ఉపఎన్నికలో వైసీపీ, టిడిపి అభ్యర్ధుల నామినేఫన్లను ఆమోదిస్తున్నట్లు ఎన్నికల కమీషన్ ప్రకటించింది.

మొత్తానికి నంద్యాల ఉపఎన్నికలో వైసీపీ అభ్యర్ధి శిల్పా మోహన్ రెడ్డి నామినేషన్ పై ఎన్నికల సంఘం స్పష్టత ఇచ్చింది. శిల్పా నామినేషన్ చెల్లుతుందంటూ అధికారికంగా ప్రకటిచింది. వైసీపీ, టిడిపిల తరపున పోటీ చేస్తున్న శిల్పా మోహన్ రెడ్డి, భూమా బ్రహ్మానందరెడ్డిల నామినేషన్లు చెల్లవంటూ రెండు పార్టీలూ ప్రత్యర్ధి పార్టీల అభ్యర్ధులపై ఎన్నిక కమీషన్ ముందు ఫిర్యాదులు చేసిన సంగతి తెలిసిందే కదా? ఈ ఫిర్యాదులపై దాదాపు రెండుగంటల పాటు రాష్ట్రం యావత్తు ఉత్కంఠతో ఊగిపోయింది.

అయితే, సాయంత్ర 6 గంటల ప్రాంతంలో శిల్పా నామినేషన్ చెల్లుతుందని ఎన్నికల సంఘం చేసిన ప్రకటనతో వైసీపీ వర్గాల్లో టెన్షన్ తగ్గింది. నామినేషన్ పత్రాలపై సంతకాలు చేసిన నోటరి రెన్యువల్ కాలేదన్న విషయంలో అసలు సమస్యే కాదంటూ తేల్చేసింది. దాంతో శిల్పా నామినేషన్ పై టిడిపి చేసిన ఫిర్యాదుతో పసలేదని తేలిపోయింది. ఇక, భూమా నామినేషన్ పై వైసీపీ చేసిన ఫిర్యాదును కూడా ఎన్నికల సంఘ కొట్టేసింది. దాంతో ఇరుపార్టీల్లోనూ పెద్ద రిలీఫ్ వచ్చింది.