Asianet News TeluguAsianet News Telugu

తూర్పు గోదావరి జిల్లా శిరోముండనం కేసులో హెడ్ కానిస్టేబుల్ పై వేటు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లాలో దళిత యువకుడి శిరోముండనం కేసులో సీతానగరం హెడ్ కానిస్టేబుల్ మీద సస్పెన్షన్ వేటు పడింది. ఈ ఘటన తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

East Godavari district head shave incident, Head Constable suspended
Author
Kakinada, First Published Jul 25, 2020, 2:45 PM IST

రాజమండ్రి: దళిత యువకుడికి శిరోముండనం చేసిన కేసులో హెడ్ కానిస్టేబుల్ పై వేటు పడింది. సీతానగరం పోలీసు స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ అప్పారావును సస్పెండ్ చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లాలో దళిత యువకుడికి శిరోముండనం చేసిన ఘటనలో కొత్త విషయం వెలుగు చూసింది. ఓ వీడియో వైరల్ కావడంతో అసలు విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అసలు గొడవ బయటకు వచ్చింది. తూర్పు గోదావరి జిల్లాలో ప్రసాద్ అనే దళిత యువకుడికి శిరోముండనం చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

ఇసుక లారీ వద్ద మాజీ సర్పంచ్, వైసీపీ నాయకుడు కవల కృష్ణమూర్తి గొడవపడ్డాడు. ఆ ఘటనలో దళిత యువకుడు గాయపడ్డాడు. గొడవ తీవ్ర రూపం దాల్చి ఘర్షణ చెలరేగింది. ఘర్షణ పెరగడంతో తమదే తప్పు అని కృష్ణమూర్తి బాధితుడు ప్రసాద్ తో అన్నట్లు వీడియోలో రికార్డయింది. అదే ఘటన శిరోముండనానికి దారి తీసిందని అంటున్నారు.

దళిత యువకుడు ప్రసాద్, వైసీపీ నాయకుడు కవల కృష్ణమూర్తికి మధ్య గొడవ జరిగింది. పరస్పరం దూషించుకు్నారు. కృష్ణమూర్తి తనపై దాడి చేశాడని ఆరోపిస్తూ ప్రసాద్ నిరసనకు దిగాడు. ఆ తర్వాత కవల కృష్ణమూర్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

పోలీసులు ప్రసాద్ ను తీసుకుని వెళ్లి ఆ రోజంతా నిర్బంధించి, దాడి చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. దానికితోడు, పోలీసులే దగ్గరుండి ప్రసాద్ కు శిరోముండనం చేయించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ వ్యవహారానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Follow Us:
Download App:
  • android
  • ios