చిత్తూరు జిల్లాలో మంగళవారం సాయంత్రం చోటు చేసుకున్న భూ ప్రకంపనలు ప్రజలను వణికించాయి. సోమల మండలం కమ్మపల్లె, ఇర్లపల్లెలో భూమి స్వల్పంగా కంపించింది.

ఒక్కసారిగా ఇంట్లో సామాగ్రి, కిటికీలు, తలుపులు కదలడంతో ప్రజలు ప్రాణ భయంతో రోడ్ల మీదకు పరుగులు తీశారు. అయితే స్థానికులు వీటిని క్వారీ బ్లాస్టింగ్ వల్ల చోటు చేసుకున్న ప్రకంపనలుగా పేర్కొంటున్నారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.