ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో శనివారం ఉదయం భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురై బయటకు పరుగులు తీశారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ర్టర రాజధాని అమరావతి ప్రాంతంలో భూకంపం చోటు చేసుకుంది. ఇళ్లలోని తలుపులు, కిటకీలు దడదడా కొట్టుకున్న శబ్దాలు వినిపించాయి. భయంతో ప్రజలు ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండి
శనివారం ఉదయం 5.30, 6 గంటల మధ్య భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. తూళ్లూరు, నెక్కల్లు, అనంతారం, కర్లపూడి ప్రాంతాల్లో ఈ భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. తాడికొండ మండలం బడెపురంలో పెద్ద శబ్దాలతో ప్రకంపనలు చోటు చేసుకుంది. "
తూళ్లూరు, తాడికొండ, అమరావతి మండలాల్లో భూప్రంకపనలు చోటు చేసుకున్నాయి. తలుపులు దడదడా కొట్టుకోవడంతో ఎవరైనా తలుపులు తడుతున్నారేమోనని బయటకు వచ్చిన ప్రజలు భూప్రంకపనలతో తీవ్రమైన భయాందోళనలకు గురయ్యారు.
