Asianet News TeluguAsianet News Telugu

చిత్తూరు జిల్లాలో భూకంపం: భయంతో జనం పరుగులు

చిత్తూరు జిల్లాలో శుక్రవారం నాడు భూమి కంపించింది. ఆరు సెకన్లపాటు భూకంపం వాటిల్లింది. జిల్లాలోని పలు గ్రామాల్లో భూకంపం వచ్చిందని స్థానికులు చెబుతున్నారు.

Earth quake in chittoor district lns
Author
Chittoor, First Published Jul 23, 2021, 11:31 AM IST

చిత్తూరు: చిత్తూరు జిల్లాలో శుక్రవారం నాడు ఆరు సెకన్లపాటు భూమి కంపించింది. దీంతో ప్రజలు భయంతో ఇళ్ల నుండి పరుగులు తీశారు. జిల్లాలోని ఈడిగపల్లె, కోటగడ్డ, శికారిపల్లె గ్రామాల్లో ఇవాళ ఉదయం ఆరు సెకన్లపాటు భూమి కంపించిందని స్థానికులు చెప్పారు.భూకంపంతో  పలు ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. పెద్ద ఎత్తున శబ్దాలు రావడంతో స్థానికులు తమ ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు. భూకంపం కారణంగా పలు ఇళ్ల పైకప్పు పెచ్చులూడి కిందపడ్డాయి.  

&

nbsp;

 

భూకంపం కారణంగా శబ్దాలు రావడంతో  స్థానికులు ఏం జరుగుతోందనే భయంతో ఇళ్ల నుండి బయటకు వచ్చారు.  ఈ విషయమై ఎంత మేరకు నష్టం వాటిల్లిందనే విషయమై  అధికారులు ఇంకా  విచారణ చేయాల్సి ఉంది. గతంలో కూడ చిత్తూరు జిల్లాలో భూకంపం వాటిల్లింది. 2020 నవంబర్ మాసంలో ఇదే జిల్లాలోని కమ్మపల్లె, ఇర్లపల్లెలో భూకంపం సంబవించింది.

Follow Us:
Download App:
  • android
  • ios