విశాఖపట్నం: విశాఖపట్నంలో దేవీనరాత్రి వేడుకలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. దేవీ నవరాత్రుల మహోత్సవాల్లో భాగంగా మహిషాసురమర్థిని రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. 

ఇదిలా ఉంటే దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని విశాఖపట్నంలో పండ్లతో అమ్మవారిని అలంకరించారు. అమ్మవారి విగ్రహం చుట్టూ పండ్లను పేర్చారు. అలాగే మెట్లును సైతం పండ్లతో అలంకరించారు. 

పండ్ల మధ్యలో అమ్మవారు కొలువుదీరి భక్తులకు దర్శనమివ్వడంతో పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. ఫలహారాలు తల్లి, పండ్ల తల్లి అంటూ అమ్మవారిని పూజిస్తున్నారు. దేవినవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతీ ఏడాది ఇదేరోజు అమ్మవారిని ఇలానే అలంకరిస్తామని నిర్వాహకులు తెలిపారు. 

"