విజయవాడ: దుర్గ అదృశ్యం కేసును పోలీసులు ఛేదించారు. కువైట్ నుంచి వచ్చిన దుర్గ ఈ నెల 16వ తేదీన గన్నవరం విమానాశ్రయం నుంచి అదృశ్యమైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆమె కోసం పోలీసులు గాలిస్తున్నారు. చివరకు ఆమె కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో ఉన్నట్లు గుర్తించారు. 

ఆమెను ప్రొద్దుటూరు నుంచి పోలీసులు గన్నవరం తీసుకుని వస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో పోలీసులు ఈ కేసును ఛేదించారు. కువైట్ నుంచి వచ్చి గన్నవరం విమానాశ్రయం నుంచి పి. దుర్గ అదృశ్యం కావడంపై భర్త సత్యనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

Also Read: కువైట్‌ టూ గన్నవరం: ఎయిర్‌పోర్ట్ నుండి అదృశ్యమైన వివాహిత

ఈ నెల 16వ తేదీన గన్నవరం విమాశ్రయంలో దిగిన దుర్గ ఆచూకీ కోసం పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. దుర్గ విమానాశ్రయంలో దిగి పార్కింగ్ కు వెళ్లే దాకా దృశ్యాలు రికార్డయ్యాయి. ఆ తర్వాత ఆమె ఎటు వెళ్లిందనే విషయం తేలలేదు. దీంతో పోలీసులు సాంకేతిక పరిజ్ఝానాన్ని ఉపయోగించి ఆమెను కనిపెట్టే పనికి పూనుకున్ినారు. 

కువైట్ నుంచి వచ్చిన దుర్గ స్నేహితురాలు ఈ నెల 17వ తేదీన ఫోన్ చేసిందని, దాంతో దుర్గ ఇక్కడికి వచ్చినట్లు తనకు తెలిసిందని, అంత వరకు ఆమె రాక గురించి తనకు తెలియదని సత్యనారాయణ పోలీసులకు వివరించాడు. కరోనా పరీక్షలు పూర్తయిన తర్వాత బయలుదేరే ముందు ఫోన్ చేస్తానని చెప్పిందని, అయితే ఆమె తనకు ఫోన్ చేయలేదని చెప్పాడు. 

దుర్గ చాలా కాలంగా కువైట్ లో పనిచేస్తోంది. అక్కడ పనిచేస్తున్న క్రమంలో రెండు సార్లు ఇక్కడికి వచ్చి తిరిగి ెవళ్లింది. వంట పనులు, ఇంటి పనులు చేసేదని సత్యనారాయణ చెప్పారు.