మందుబాబు వీరంగం .. అడిగిన బ్రాండ్ ఇవ్వలేదని, ఏకంగా వైన్‌షాప్‌కు నిప్పు.. రూ. లక్షల్లో మద్యం బుగ్గిపాలు

దీపావళి పర్వదినం నాడు ఓ మందుబాబు విశాఖలో వీరంగం సృష్టించాడు. తాను అడిగిన బ్రాండ్ మద్యం ఇవ్వలేదని.. ఏకంగా లిక్కర్ షాప్‌కు నిప్పంటించాడు. ఈ ప్రమాదంలో దాదాపు రూ.2 లక్షల విలువైన మద్యం, కంప్యూటర్, ప్రింటర్, స్కానర్, ఫ్రిజ్ కాలిపోయాయి.

drunk man set fire in liquor shop at Visakhapatnam ksp

దీపావళి పర్వదినం నాడు ఓ మందుబాబు విశాఖలో వీరంగం సృష్టించాడు. తాను అడిగిన బ్రాండ్ మద్యం ఇవ్వలేదని.. ఏకంగా లిక్కర్ షాప్‌కు నిప్పంటించాడు. వివరాల్లోకి వెళితే.. నగరంలోని కొమ్మాది సాయిరాం కాలనీకి చెందిన గుమ్మడి మధు పీకలదాకా తాగి అది చాలదన్నట్లు దగ్గరలోని వైన్‌షాప్‌ వద్దకు వచ్చాడు. ఓ బ్రాండ్ పేరు చెప్పి అది ఇవ్వమన్నాడు. అది అందుబాటులో లేదని సిబ్బంది చెప్పడంతో మధు కోపంతో ఊగిపోయాడు. 

ఓ బాటిల్‌లో పెట్రోల్ తీసుకొచ్చి మద్యం షాపుపై పోసి నిప్పంటించాడు. చూస్తుండగానే క్షణాల్లో దుకాణం మొత్తం మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న పోలీసులు , అగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో దాదాపు రూ.2 లక్షల విలువైన మద్యం, కంప్యూటర్, ప్రింటర్, స్కానర్, ఫ్రిజ్ కాలిపోయాయి. లోపల వున్న సిబ్బంది ప్రాణభయంతో పరుగులు తీయగా.. తోటి మందుబాబులు, స్థానికులు నిందితుడు మధును పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పీఎం పాలెం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios