విశాఖలో మరోసారి డ్రగ్స్ కలకలం రేపాయి. తెన్నేటి పార్క్ ఏరియాలో మాదక ద్రవ్యాలను అక్రమంగా రవాణా చేస్తున్న వర్మరాజు అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన నిందితుడు గత కొన్నాళ్లుగా ముగ్గురు స్నేహితులతో కలిసి హోటల్ నిర్వహిస్తున్నాడు. హైదరాబాద్ నుంచి కొరియర్ ద్వారా వర్మ రాజు డ్రగ్స్ తెప్పించినట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది.

నిందితుడి వద్ద నుంచి 6 ఎల్ఎస్‌డీ బోల్ట్స్, 200 మిల్లీ గ్రాముల ఎండీఎంఏ, 200 గ్రాముల గంజాయి ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.