Srisailam: శ్రీశైలం దేవాలయంలో డ్రోన్ కలకలం సృష్టించింది. శుక్రవారం రాత్రి ఆలయ పరిసరాల్లో డ్రోన్ చక్కర్లు కొట్టింది. దీంతో ఆలయ అధికారులు అలర్టయ్యారు.
Srisailam: శ్రీశైలం పుణ్యక్షేత్రంలో డ్రోన్ కలకలం సృష్టించింది. శుక్రవారం అర్థరాత్రి సమయంలో ఆలయ పరిసరాల్లో డ్రోన్ చక్కర్లు కొట్టింది. ప్రధాన ఆలయం, గోపురం, ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్, ఆలయ పరిసరాలతో పాటు.. ప్రైవేట్ సత్రాలపై డ్రోన్ తిరిగినట్టు స్థానికులు చెబుతున్నారు. దాన్ని గమనించిన స్థానికులు ఆలయ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో సిబ్బంది వెంటనే అలర్టయ్యారు.
ఆలయ డ్రోన్ ను అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించారు. కానీ.. సెక్యూరిటీ సిబ్బంది ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ఆలయ సత్రాల పైకి ఎక్కి యాత్రికులే డ్రోన్ ఎగరేసి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. డ్రోన్ ను ఉపయోగించిన వారి కోసం గాలింపు చేపట్టారు. ఇటీవలకాలంలో శ్రీశైలం ఆలయంపై డ్రోన్లు ఎగరడం సాధారణంగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. దేవస్థానానికి ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
