Asianet News TeluguAsianet News Telugu

శ్రీశైలం డ్రోన్ల కలకలం: జల్లెడ పడుతున్న 100 మంది పోలీసులు

ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం ఆలయ పరిసరాల్లో  ఐదు రోజులుగా డ్రోన్లు కలకలం సృష్టిస్తున్నాయి. ఈ డ్రోన్ల ఆచూకీని కనుగొనేందుకుగాను కర్నూల్ జిల్లా పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

Drone camera once again flies over Srisailam temple lns
Author
Srisailam, First Published Jul 6, 2021, 11:40 AM IST

శ్రీశైలం: ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం ఆలయ పరిసరాల్లో  ఐదు రోజులుగా డ్రోన్లు కలకలం సృష్టిస్తున్నాయి. ఈ డ్రోన్ల ఆచూకీని కనుగొనేందుకుగాను కర్నూల్ జిల్లా పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. శ్రీశైలం ఆలయ పరిసరాల్లో సోమవారం నాడు రాత్రి కూడ రెండు డ్రోన్లు చక్కర్లు కొట్టాయి. ఈ రెండు డ్రోన్లను పట్టుకొనేందుకు పోలీసులు తమ వద్ద ఉన్న డ్రోన్ ను వినియోగించారు. కానీ ఈ రెండు డ్రోన్ల ఆచూకీని కనిపెట్టలేకపోయారు.ఈ డ్రోన్ల ఆచూకీని కనిపెట్టేందుకుగాను 100 మంది పోలీసులు నిరంతరం పనిచేస్తున్నారు. సోమవారం నాడు రాత్రి ఎస్పీ ఫకీరప్ఫ శ్రీశైలం సందర్శించారు. స్థానిక పోలీసులతో పాటు ఆలయ అధికారులతో ఎస్పీ చర్చించారు. 

also read:శ్రీశైలంలో మళ్లీ డ్రోన్ల కలకలం: పోలీసుల అదుపులో అనుమానితుడు

డ్రోన్లను ఎవరూ వినియోగిస్తున్నారు. ఆలయ పరిసరాల్లో డ్రోన్లను ఎందుకు తిప్పుతున్నారనే విషయమై అంతుపట్టడం లేదు.డ్రోన్ల వినియోగం కోసం ఆలయ అధికారులు కూడ ఎవరికీ కూడ అనుమతి ఇవ్వలేదు. అయినా కూడ డ్రోన్లు ఎవరు ఆపరేట్ చేస్తున్నారనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆలయ సమీపంలో కొద్దిసేపు చక్కర్లు కొడుతున్న డ్రోన్లు వెంటనే నల్లమల అటవీ ప్రాంతం వైపు వెళ్లి  అదృశ్యమౌతున్నాయి. డ్రోన్ల విషయంలో ఇప్పటికే ఓ వ్యక్తిని  పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. ఈ విషయంతో అతనికి సంబంధం లేదని వదిలేశారు. శ్రీశైలంలో ప్రతి ఇంటిని పోలీసులుజల్లెడ పడుతున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios