నెల్లూరు: నెల్లూరు పట్టణంలోని ఓ ప్రైవేట్‌ స్కూల్‌లో  8వ తరగతి విద్యార్ధినిపై వ్యాన్‌ డ్రైవర్ శివ  అత్యాచారయత్నానికి గురువారం నాడు ప్రయత్నించాడు. శివ‌ను స్థానికులు చితకబాది పోలీసులకు అప్పగించారు. 

నెల్లూరు పట్టణంలోని ప్రైవేట్‌ స్కూల్లో విద్యను అభ్యసించే  ఓ విద్యార్థిని  ప్రతిరోజూ మాదిరిగానే గురువారం నాడు స్కూల్ వ్యాన్‌లో స్కూల్‌కు బయలు దేరింది.

అయితే స్కూల్‌ వ్యాన్‌లో ఎవరూ లేని విషయాన్ని గుర్తించిన వ్యాన్ డ్రైవర్ శివ వ్యాన్‌లో ఉన్న 8వ తరగతి విద్యార్ధినిపై  వ్యాన్‌లోనే అత్యాచారయత్నానికి ప్రయత్నంచాడు.  దీంతో ఆ బాలిక  కేకలు వేసింది. బాలిక కేకలు విన్న స్థానికులు వెంటనే అక్కడికి చేరుకొన్నారు.  వ్యాన్ డ్రైవర్ శివను చితకబాదారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొన్నారు.

గతంలో కూడ శివపై ఇదే రకమైన ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయమై పాఠశాల యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకోలేదని  విద్యార్ధుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. స్కూల్ విద్యార్ధినిపై వ్యాన్ డ్రైవర్ అత్యాచారయత్నానికి ప్రయత్నించడంతో ఆగ్రహనికి  గురైన స్థానికులు స్కూల్ వ్యాన్ ను దగ్ధం చేశారు.