Asianet News TeluguAsianet News Telugu

జీన్స్, టీ షర్ట్‌లు ధరించకూడదు .. ఏపీలో వైద్య విద్యార్థులకు డ్రెస్ కోడ్..!

ఆంధ్రప్రదేశ్‌లో వైద్య విద్యార్తుల దుస్తులపై రాష్ట్ర వైద్య విద్య సంచాలక కార్యాలయం ఆంక్షలు విధించింది. వైద్య విద్యార్థులు జీన్స్ ప్యాంట్లు, టీ షర్టులు ధరించకూడదని స్పష్టం చేసింది.

Dress Code Medicine students in andhra Pradesh
Author
First Published Dec 2, 2022, 11:02 AM IST

ఆంధ్రప్రదేశ్‌లో వైద్య విద్యార్తుల దుస్తులపై రాష్ట్ర వైద్య విద్య సంచాలక కార్యాలయం ఆంక్షలు విధించింది. వైద్య విద్యార్థులు జీన్స్ ప్యాంట్లు, టీ షర్టులు ధరించకూడదని స్పష్టం చేసింది. మహిళా వైద్యులు, వైద్య విద్యార్థినులు చీర లేదా చుడీదార్లు మాత్రమే ధరించాలని సూచించింది. అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్లు కూడా జీన్స్ ధరించకూడదని తెలిపింది.

పురుష విద్యార్థులు షేవ్ చేసుకోవడంతో పాటు..  జుట్టు, గెడ్డం చక్కగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. మహిళా విద్యార్థులు జుట్టు వదులుగా వదిలేయకూడదని తెలిపింది. జట్టును హెయిర్‌ బాండ్‌తో ముడి వేసుకోవాలని సూచించింది. వైద్య విద్యార్థులంతా ప్రధానంగా యాప్రాన్‌ వేసుకోవడంతో పాటు మెడలో తప్పనిసరిగా స్టెతస్కోప్‌ ధరించాలని స్పష్టం చేసింది.  

ఇక, బోధనాస్పత్రుల సూపరింటెండెంట్లు, ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నారు. బోధనాస్పత్రులకు పంపిన సూచనల్లో ఈ డ్రెస్ కోడ్‌ను ప్రస్తావించారు. ఇప్పటికే నిర్దేశించిన డ్రెస్ కోడ్‌కు కొందరు విద్యార్థినులు, వైద్యులు, పారామెడికల్ సిబ్బంది పాటించకపోవడంతో ఈ ఆదేశాలు జారీచేసినట్టుగా పేర్కొన్నారు. 

ఇక, బోధనాసుపత్రులకు వచ్చే రోగులను ఇన్‌ పేషెంట్లుగా చేర్చుకోవాల్సి వస్తే.. సహాయకులు లేరన్న కారణంతో వారిని చేర్చుకోవడాన్ని తిరస్కరించవద్దని సూచించింది. బోధనాస్పత్రుల్లో పనిచేసే సిబ్బంది తప్పనిసరిగా ముఖ హాజరుకు సంబంధించి ఎన్‌రోల్‌ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని ఆదేశించింది.

Follow Us:
Download App:
  • android
  • ios