Asianet News TeluguAsianet News Telugu

ప్లాస్టిక్ రహిత తిరుమలే టార్గెట్.. టీటీడీకి డీఆర్‌డీవో సహకారం, శ్రీవారి ప్రసాదం కోసం స్పెషల్ కవర్స్

తిరుమల క్షేత్రాన్ని క్లీన్ అండ్ గ్రీన్‌గా మార్చేందుకు గాను ప్లాస్టిక్ రహిత తిరుమల కోసం టీటీడీ అనేక చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో డీఆర్‌డీవో సహకారంతో ప్రసాదం కోసం ప్రత్యేకమైన సంచులు తయారుచేసింది.
 

drdo designs ecolastic covers for tirumala temple
Author
Tirupati, First Published Aug 22, 2021, 3:59 PM IST

తిరుమల శ్రీవారి పుణ్యక్షేత్రాన్ని క్లీన్ అండ్ గ్రీన్ గా మార్చాలని టీటీడీ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా ప్లాస్టిక్ రహిత తిరుమల కోసం అనేక చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో, దేశ రక్షణ రంగ అవసరాలు తీర్చే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో) తిరుమల క్షేత్రంలో ప్రసాదం కోసం ప్రత్యేకమైన సంచులు తయారుచేసింది.

బయో డీగ్రేడబుల్ కేటగిరీకి చెందిన ఈ సంచులు ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయంగా ఉపయోగపడతాయి. వీటిని ఎకోలాస్టిక్ సంచుల పేరిట డీఆర్డీవో రూపొందించింది. తాజాగా ఈ సంచుల విక్రయకేంద్రాన్ని తిరుమలలో టీటీడీ ఈవో జవహరెడ్డి, డీఆర్డీవో చైర్మన్ సతీశ్ రెడ్డి ప్రారంభించారు.

ఈ సంచుల వల్ల పర్యావరణానికి ఎలాంటి హాని ఉండదని డీఆర్‌డీవో తెలిపింది. ఇవి 3 నెలల్లోనే భూమిలో కలిసిపోతాయని.. వీటిని పశువులు తిన్నప్పటికీ ఎలాంటి హాని ఉండదని తెలిపారు. ఈ ఎకోలాస్టిక్ కవర్లను రెండు రకాలుగా అందుబాటులోకి తెచ్చారు. 5 లడ్డూలు పట్టే సంచి ధర రూ.2 కాగా.... 10 లడ్డూలు పట్టే సంచి ధరను 5 రూపాయలుగా నిర్ణయించారు 

Follow Us:
Download App:
  • android
  • ios