విశాఖ డాక్టర్ సుధాకర్ కేసు: సీబీఐ నివేదికపై ఏపీ హైకోర్టు అసంతృప్తి

విశాఖపట్టణం జిల్లాలోని నర్సీపట్నం ప్రభుత్వాసుపత్రి వైద్యుడు డాక్టర్ కె. సుధాకర్ వ్యవహారంపై సీబీఐ దాఖలు చేసిన నివేదికపై ఏపీ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. 

Dr Sudhakar case: HC seeks detailed report from CBI lns

విశాఖపట్టణం: విశాఖపట్టణం జిల్లాలోని నర్సీపట్నం ప్రభుత్వాసుపత్రి వైద్యుడు డాక్టర్ కె. సుధాకర్ వ్యవహారంపై సీబీఐ దాఖలు చేసిన నివేదికపై ఏపీ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. 

ఈ కేసును సీబీఐ అదనపు డైరెక్టర్ స్థాయికి తగ్గని అధికారితో మరింత లోతుగా దర్యాప్తు చేయించాలని సీబీఐ డైరెక్టర్ ను హైకోర్టు ఆదేశించింది. కోర్టుకు సమర్పించే నివేదికపై విశాఖలోని సీబీఐ ఎస్పీ సంతకం కాకుండా జాయింట్ డైరెక్టర్ సంతకం ఉండాలని హైకోర్టు స్పష్టం చేసింది.

ఈ కేసు విచారణను ఈ ఏడాది ఏప్రిల్ మొదటి వారానికి కోర్టు వాయిదా వేసింది. జస్టిస్ రాకేష్ కుమార్, జస్టిస్ రమేష్ తో కూడిన ధర్మాసనం ఈ మేరకు సోమవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది.

also read:డాక్టర్ సుధాకర్ న్యూసెన్స్ చేస్తున్నారు, వెనుక రాజకీయ నేతలు: విశాఖ సీపీ

డాక్టర్ సుధాకర్ విషయంలో విశాఖపట్టణం పోలీసులు వ్యవహరించిన తీరుపై టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే గీత హైకోర్టుకు రాసిన లేఖను సుమోటోగా తీసుకొని కోర్టు  కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

ఈ కేసు విచారణను ఏపీ హైకోర్టు సీబీఐకి అప్పగించింది. ఈ ఏడాది మే 22వ తేదీన సీబీఐ ఈ కేసు విచారణను ప్రారంభించింవది. గత నెల 24వ తేదీన సీల్డ్ కవర్లో నివేదికను సీబీఐ హైకోర్టుకు సమర్పించింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios