తిరుమల శ్రీవారి ఆలయ ప్రత్యేకాధికారి (ఓఎస్డీ) డాలర్ శేషాద్రి అస్వస్థతకు గురయ్యారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన గరుడ సేవలో ఆయన ఎక్కువసేపు పాల్గొన్నారు. దీంతో అలసటకు లోనైన శేషాద్రి అనారోగ్యానికి గురయ్యారు. వెంటనే ఆలయ సిబ్బంది ఆయనను చెన్నై అపోలోకి తరలించారు.. గతంలోనూ ఆయన గుండెపోటుకు గురికావడంతో ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు.