కృష్ణాజిల్లా, తిరువూరు పట్టణంలో పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. కనిపించిన వారినల్లా కరుస్తుండడంతో జనాలు బెంబేలెత్తి పోయారు. 

"

తిరువూరులోని బస్టాండ్ సెంటర్, మార్కెట్ సెంటర్, మున్సిపల్ కార్యాలయం శివారులో యథేచ్ఛగా తిరుగుతూ, కనపడిన వారినల్లా కాటేసింది. ఇలా మొత్తం 20 మందిని కరిచింది. 

కుక్కకాటుకు బలైన వారిలో చిన్నపిల్లలు, మహిళలు ఉండటంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.