తిరుపతి: ఓ హత్య కేసులో 12 మంది నిందితుల్లో ఒకరికి కరోనా సోకింది. దీంతో పోలీసులు, జర్నలిస్టులకు కరోనా టెన్షన్ నెలకొంది.

తిరుపతిలో చోటు చేసుకొన్న ఓ హత్య కేసులో 12 మంది నిందితులను పోలీసులు ఈ నెల 25వ తేదీన మీడియా ముందు ప్రవేశపెట్టారు. నిందితుల్లో ఒకరికి కరోనా ఉన్నట్టుగా తేలింది. రిమాండ్ కు తరలించే క్రమంలో నిందితులకు పరీక్షలు నిర్వహించిన సమయంలో ఈ విషయం వెలుగు చూసింది. 

also read:ఒక్క రోజులోనే 10 మంది మృతి: ఏపీలో 11,489కి చేరిన కరోనా కేసులు

తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్ లో ఈ ఘటన చోటు చేసుకొంది. పోలీస్ స్టేషన్ ఆవరణలోనే పోలీసులతో పాటు ఈ మీడియా సిబ్బందికి కూడ కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు.

ఎంతమందికి కరోనా వస్తోందోననే ఆందోళన నెలకొంది.  ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. చిత్తూరు జిల్లాలో కూడ కేసులు ఇటీవల కాలంలో పెరుగుతున్నాయి.  రాష్ట్రంలో శుక్రవారం నాటికి కరోనా కేసులు రాష్ట్రంలో 11,489కి చేరుకొన్నాయి. ఒక్క రోజు వ్యవధిలోనే 10 మంది మరణించారు.