న్యూఢిల్లీ: వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణం రాజుకు ఢిల్లీలోని ఎయిమ్స్ లో వైద్య పరీక్షలు జరిగాయి. ఆయనకు వైద్యులు సిటీ స్కాన్, ఎమ్మారై స్కాన్ తో పాటు పలు పరీక్షలు నిర్వహించారు. ఆయన పాదాల్లో సెల్ డ్యామేజీ చాలా ఎక్కువ ఉన్నట్లు గుర్తించారు. రెండు కాళ్లకు కూడా వైద్యులు పీవోపీ కట్టు కట్టారు. 

రెండు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు ఆయన సూచించారు. ఎట్టి పరిస్థితిలో కూడా నడవకూడదని ఆయనకు వైద్యులు చెప్పారు. పరీక్షలు పూర్తయిన తర్వాత రఘురామ కృష్ణం రాజు గురువారం తన అధికారిక నివాసానికి చేరుకున్నారు. 

సుప్రీంకోర్టు ఆదేశాలతో రఘురామ కృష్ణం రాజుకు సికింద్రాబాదులోని ఆర్మీ ఆస్పత్రిలో వైద్య పరకీష్లు జరిగిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్  ముంజూరు చేసింది. ఈ నేపథ్యంలో ఆయన ఇటీవల ఆర్మీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జయ్యారు. ఆర్మీ ఆస్పత్రి నుంచి నేరుగా ఆయన ఢిల్లీకి చేరుకుని ఎయమ్స్ లో చేరారు. 

ఎయిమ్స్ ఆయనకు వివిధ పరీక్షలు నిర్వహించారు. కాగా, రాజద్రోహం కేసు కింద ఏపీ సీఐడి ఆయనను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. హైదరాబాదులో అరెస్టు చేసి ఆయనను గుంటూరు తీసుకుని వెళ్లారు. తనను సిఐడి కస్టడీలో కొట్టారని రఘురామ కోర్టుకు ఫిర్యాదు చేశారు. ఆయన సుప్రీం కోర్టు నుంచి బెయిల్ పొందారు.