Asianet News TeluguAsianet News Telugu

డాక్టర్ డీస్పీగా మారి.. ఆల్ రౌండర్ పురస్కారం

వృత్తిరీత్యా ఈయన డాక్టర్‌. 2002–2008లో ఎంబీబీఎస్‌ పూర్తి చేసి 2010లో సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌గా శ్రీకాకుళం జిల్లా ఆస్పత్రిలో విధుల్లో చేరారు. 

Doctor Turned Into DSP in Anantapuram
Author
hyderabad, First Published Nov 26, 2020, 2:40 PM IST

డాక్టర్, పోలీస్.. ఈ రెండు ఉన్నత పదవులే. కానీ రెండు విభిన్నమనవి కానీ. ఓ వ్యక్తి డాక్టర్ విద్యను చదివి.. ఆ తర్వాత ఆ వైద్య వృత్తిని పక్కన పెట్టి.. పోలీసు అవతారం ఎత్తాడు. ఆయన అలా డాక్టర్ నుంచి పోలీసుగా మారడానికి ఓ బలమైన కారణం ఉండటం గమనార్హం. గిరిజనుల సమస్యలను చూసి చలించిపోయి ఆయన  డాక్టర్ నుంచి పోలీసు గా మారారు.పాలనా విభాగంలో ఉంటే మరిన్ని సమస్యలు పరిష్కరించవచ్చనే తలంపుతో గ్రూప్‌–1 రాసి డీఎస్పీగా ఎంపికయ్యారు. తన ఆకాంక్షలను నెరవేర్చుకునే దిశగా ముందడుగు వేస్తున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. జంగారెడ్డిగూడెం డీఎస్పీగా బి.రవికిరణ్‌ ఇటీవల బాధ్యతలు స్వీకరించారు. ఆయన డీఎస్పీగా ఎంపికై శిక్షణ పూర్తి చేసుకుని తొలి పోస్టింగ్‌గా జంగారెడ్డిగూడెం వచ్చారు. వృత్తిరీత్యా ఈయన డాక్టర్‌. 2002–2008లో ఎంబీబీఎస్‌ పూర్తి చేసి 2010లో సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌గా శ్రీకాకుళం జిల్లా ఆస్పత్రిలో విధుల్లో చేరారు. అక్కడ 2014 వరకు విధులు నిర్వహించి, తర్వాత అదే జిల్లా అక్కులపేట పీహెచ్‌కీ బదిలీ అయ్యారు. వైద్యాధికారిగా పీహెచ్‌సీని ఆధునీకరించారు. కార్పొరేట్‌ ఆస్పత్రి స్థాయిలో పీహెచ్‌సీని మార్పు చేసి వైద్య సేవలు అందించారు. 2016, 2017లో రాష్ట్రస్థాయి ఉత్తమ ఆస్పత్రి, ఉత్త వైద్యులుగా రవికిరణ్‌ పురస్కారాలు అందుకున్నారు. 2017, 2018లో విశాఖలో పనిచేశారు.

రవికిరణ్‌ అక్కులపేట పీహెచ్‌సీలో పనిచేస్తుండగా గిరిజనుల సమస్యలు గుర్తించారు. అల్లిపల్లిగూడెం గిరిజనులు, గిరిజనే తరులు మధ్య భూవివాదాలు గుర్తించి కలెక్టర్‌ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషిచేశారు. అప్పుడే ఆయనకు అడ్మినిస్ట్రేటర్‌ కావాలనే ఆలోచన వచ్చింది. 2016లో గ్రూప్‌–1కు రాయగా 2017 ఫలితాలు వచ్చాయి. రవికిరణ్‌ 12వ ర్యాంకు సాధించారు. దీంతో ఆయన డీఎస్పీగా ఎంపికయ్యారు. తొలి పోస్టింగ్‌గా జంగారెడ్డిగూడెం వచ్చారు.

డీఎస్పీగా ఎంపికైన రవికిరణ్‌ 2018లో అనంతపురంలో శిక్షణ పొందారు. శిక్షణలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి సీఎం పిస్టల్‌ అవార్డును అందుకున్నారు. శిక్షణలో ఆల్‌రౌండర్‌గా నిలిచి హోంమంత్రి, డీజీపీ చేతుల మీదుగా పురస్కారం పొందారు.  

శ్రీకాకుళం జిల్లా అరసవల్లికి చెందిన రవికిరణ్‌ తండ్రి రాధాకృష్ణ, తల్లి విజయకుమారి. ఆయన భార్య విశాఖలోని మెప్మా జిల్లా మిషన్‌ కో–ఆర్డినేటర్‌గా పనిచేస్తున్నారు. రవికిరణ్‌కు కుమారుడు, కుమార్తె ఉన్నారు. రవికిరణ్‌ ఎంబీబీఎస్‌ చేస్తున్న సమయంలో అథ్లెటిక్స్‌లో రాణించారు. లాంగ్‌ జంప్, హైజంప్, పరుగు పోటీల్లో జిల్లా, రాష్ట్రస్థాయిలో 73 వరకు పతకాలు సాధించారు. మొత్తంగా 126 వరకు ఆయన పతకాలు పొందారు.

Follow Us:
Download App:
  • android
  • ios