నంద్యాలలో డాక్టర్ కుటుంబంలో విషాదం: కరోనాతో భార్యాభర్తలు మృతి

కర్నూలు జిల్లా నంద్యాలలోని ఓ వైద్యుడి కుటుంబంలో కరోనా తీవ్రమైన విషాదాన్ని కల్పించింది. కరోనా వైరస్ సోకి భార్యాభర్తలు ఇద్దరు కొద్ది గంటల వ్యవధిలోనే మరణించారు.

Doctor couple die at Nandyal with coronavirus

కర్నూలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా నంద్యాలలో డిహెచ్ఎంఎస్ వైద్యుడి కుటుంబంలో కరోనా విషాదం చోటు చేసుకుంది. భార్యాభర్తలు ఇద్దరూ మృతి చెందారు. స్థానిక నంద్యాలలోని గాంధీ చౌక్ సమీపంలో హోమియోపతి వైద్యుడిగా నివాసం ఉండే డాక్టర్ వీజికెవంకధార గురు కృష్ణ మూర్తి (72), ఆయన భార్య సుజాతమ్మ (70) కరోనాతో కొలుకోలేక మరణించారు. 

భార్య మృతి చెందిన విషయం విన్న డాక్టర్ విజికె మూర్తి కరోనాతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గత రాత్రి మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు.ఒకపక్క తల్లిదండ్రులు కరోనా మహమ్మారి బారినపడి కోలుకోలేక మృతి చెందగా, మరోపక్క కుమారుడు కూడా కరోనాతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఘటన నంద్యాల లో చోటు చేసుకోవడంతో తీవ్ర విషాదం నెలకొంది..

కరోనాతో పోరాడి కొలుకోలేక వైద్యుడు, అతని భార్య ఒకరి తరువాత ఒకరు మృతి చెందిన వార్త విని స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. స్థానికంగా ఎంతో మందికి వైద్య సేవలు చేసి అందరి ప్రాణాలను కాపాడిన వైద్యుడు ఆయన.కరోనా మహమ్మారి కోరల్లో చిక్కుకొని గంటల వ్యవధిలోనే ఇద్దరు మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది.

ఇదిలావుంటే, ఆంధ్రప్రదేశ్ శాసనసభలో పనిచేస్తున్న మరో తొమ్మిది మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.దీంతో అసెంబ్లీలో కరోనా బాధితుల సంఖ్య 17కు‌‌ చేరుకుంది. మరికొన్ని రిపోర్టులు ఇంకా రావాల్సి ఉన్నాయి. 

అసెంబ్లీలో కరోనా బాధితుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. పరిస్థితి తీవ్రమవుతున్నందున వర్క్ ఫ్రం హోం ఇవ్వాలని అసెంబ్లీ ఉద్యోగులు కోరుతున్నారు.

కాగా, విజయవాడనగరంలో కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న ప్రాంతాల్లో లాక్ డౌన్ విధించడానికి సన్నాహాలు చేస్తున్నారు. మొత్తం 21 క్లస్టర్లలో కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల్లో సోమవారం నుండి రాకపోకలపై నియంత్రణ అమలు చేస్తున్నారు. అధికారులు బ్యారికేడ్లు ఏర్పాటు చేస్తున్నారు.

విజయవాడలో కోవిడ్19 క్లస్టర్లుగా ఈ ప్రాంతాలను ప్రకటించారు. అవి పటమట, కృష్ణలంక, కొత్తపేట, మొగల్రాజపురం, విద్యాధరపురం, అజిత్ సింగ్ నగర్, భవానీపురం, చుట్టుగుంట, సత్యనారాయణపురం, వించిపేట, చిట్టినగర్

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios