Asianet News TeluguAsianet News Telugu

వివాహిత హత్య కేసు... కానిస్టేబుల్ కి డీఎన్ఏ పరీక్ష

సుజాత పట్టణంలోనే ఒంటరిగా జీవనం సాగించేది. ఈ నేపథ్యంలో సుజాత హత్యచారం ఘటన సంచలనం రేపింది. మహిళలపై అత్యాచారం జరిపి ఆ తర్వాత హత్య చేసినట్లు తెలుస్తోంది.
 

DNA Test to constable over married woman murder case
Author
Hyderabad, First Published Oct 26, 2019, 7:52 AM IST

రాజంపేట పట్టణంలో ఇటీవల సంచలనం రేపిన వివాహిత హత్య కేసును చేధించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ హత్య కేసులో కానిస్టేబుల్ కి డీఎన్ఏ  పరీక్ష చేయాలని పోలీసులు భావిస్తున్నారు. మృతురాలి వీర్యం శాంపిల్స్, బ్లడ్‌శాంపిల్స్‌ రిపోర్టుతోపాటు కానిస్టేబుల్‌ డీఎన్‌ఏ రిపోర్టు వచ్చిన తర్వాత హత్యకేసు మిస్టరీ వీడే అవకాశాలు ఉన్నాయని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. 

పూర్తి వివరాల్లోకి వెళితే... రాజంపేట పట్టణం నడిబొడ్డున నూని వారిపల్లెరోడ్డులోని నలందా స్కూలు వీధిలో శ్రీనివాసులరెడ్డి, సుజాత దంపతులు నివాసం ఉంటున్నారు. భర్త జీవనోపాధి కోసం గల్ఫ్‌దేశానికి వెళ్లారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. సుజాత పట్టణంలోనే ఒంటరిగా జీవనం సాగించేది. ఈ నేపథ్యంలో సుజాత హత్యచారం ఘటన సంచలనం రేపింది. మహిళలపై అత్యాచారం జరిపి ఆ తర్వాత హత్య చేసినట్లు తెలుస్తోంది.

సుజాత హత్య కేసులో ప్రధానంగా కిరణ్‌ అనే కానిస్టేబుల్‌కు డీఎన్‌ఏ పరీక్షలు చేసినట్లుగా వెలుగులోకి వచ్చింది. మృతిచెందిన సుజాతతో ఆర్థిక వ్యవహారాలు సాగిస్తున్న కానిస్టేబుల్‌ ఆమెతో సన్నిహితంగా ఉండేవారు. ఈ నేపథ్యంలో  కానిస్టేబుల్‌ కిరణ్‌ రక్తాన్ని డీఎన్‌ఏ పరీక్ష నిమిత్తం ఫోరెన్సిక్‌ ల్యాబోరేటరీకి పంపారు. ఈ విషయాన్ని డీఎస్పీ నారాయణస్వామిరెడ్డి ధ్రువీకరించారు.

Follow Us:
Download App:
  • android
  • ios