ఏపీ సీఎం జగన్ పై వైసీపీ నేత, మాజీ మంత్రి డీఎల్ రవీంద్రా రెడ్డి ప్రశంసల వర్షం కురిపించారు. అదేవిధంగా మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పై విమర్శల వర్షం కురిపించారు. చంద్రబాబు పాలనలో విచ్చల విడిగా అవినీతి జరిగిందని ఆయన ఆరోపించారు. 

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అప్పటి ఆర్థిక శాఖ మంత్రి యనమల తన వియ్యంకుడు పుట్టా సుధాకర్ యాదవ్ కి అప్పనంగా కాంట్రాక్ట్ అప్పగించారని ఆరోపించారు. రాష్ట్రంలో పనులకు సాక్షాాత్తు రాష్ట్ర తమంత్రి కమిషన్ తీసుకోవడం సిగ్గుచేటు అన్నారు. గత ఐదేళ్లలో రాష్ట్రంలో నీటిపారుదల రంగంలో జరిగిన అన్ని పనులపై సీబీఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల అనంతరం జగన్ ని కలిసి తాను దన్యవాదాలు చెప్పినట్లు గుర్తు చేసుకున్నారు.

తాను వైఎస్ జగన్ కి వ్యతిరేకంగా పోటీ చేసినా... ఆయన మాత్రం తన పట్లే ప్రేమే చూపించారని డీఎల్ అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ఖజానాను టీడీపీ నేతలు దోచుకున్న విధానాన్ని తాను జగన్ కి వివరించినట్లు  చెప్పానన్నారు. కుప్పంలో హంద్రీనీవా పనుల్లో 75 కోట్ల పనులను 400 కోట్లకు పెంచి అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు.
 
అన్ని ప్రాజెక్టుల పనుల్లో వేలకోట్ల అవినీతి జరిగిందన్నారు.  ఆప్కోలో జరిగిన అవినీతిపై ప్రత్యేక విచారణ జరిపించాలని ముఖ్యమంత్రిని కోరుతున్నానని ఆయన చెప్పారు.