అనంతపురం పార్లమెంట్ సభ్యుడు జెసి దివాకర్ రెడ్డి ఎక్కడున్న సంచలనమే. ఏమి మాట్లాడినా సంచలనమే. కాంగ్రెస్ లో నుండి టిడిపిలో చేరిన సంగతి తెలిసిందే అయితే, జెపి పార్టీలో చేరిన దగ్గర నుండి ఆయన్ను నియంత్రించలేక టిడిపి నాయకత్వం ఇబ్బంది పడుతోంది.

 

అటువంటి తాజాగా జెసి మరో సంచలన ప్రకటన చేసారు. ఎంపిలు, ఎంఎల్ఏ, ఎంఎల్ సిలతో మంగళవారం విజయవాడలో టిడిపి వర్క్ షాపు నిర్వహించింది.

 

అయితే, వర్క్ షాపులో ఎంతమంది ప్రజా ప్రతినిధులు పాల్గొన్నా జెసి వ్యాఖ్యలే సంచలనంగా మారింది. ఇంతకీ జెసి ఎమన్నారంటే, చంద్రబాబేమన్నా గాంధీ మహాత్ముడా అని ప్రశ్నించారు. పిలిస్తే జనం రావటానికి చంద్రబాబు ఏమన్నా గాంధీ మహాత్ముడా అని ఆశ్చర్యపోయారు.


అంతేకాకుండా, చంద్రబాబు ఒక్కడి వల్లే టిడిపి అధికారంలోకి రాలేదని కూడా అన్నారు. అందరూ కష్టపడితేనే చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారని కుండబద్దలు కొట్టినట్లు
చెప్పారు.

 

అలాగే, చంద్రబాబు కేవలం అధికారులతోనే పాలిస్తున్నట్లు అసంతృప్తి వ్యక్తం చేసారు. అధికారుల రాజ్యం వద్దని తాను చంద్రబాబుకు ఎన్నోసార్లు చెప్పినట్లు గుర్తుచేసారు. తన పద్దతి మార్చుకోకపోతే ఇబ్బంది తప్పదని కూడా హెచ్చరించారు.

 

గుర్తింపు గురించి మాట్లాడుతూ, పయ్యావుల కేశవ్ వంటి సీనియర్ నాయకులకే గుర్తింపు లేకపోతే తమలాంటి వాళ్ళ పరిస్ధితి ఏంటని వాపోయారు.