ఎన్టీఆర్, పీవీ సమాధులను కూల్చివేయాలంటూ ఇటీవల ఎంఐఎం నేత అక్బరుద్దీన్ పేర్కొన్న సంగతి తెలిసిందే. కాగా.. ఈ కామెంట్స్ పై టీడీపీ మహిళా నేత దివ్య వాణి స్పందించారు. అక్బరుద్దీన్ చేసిన కామెంట్స్ పై ఆమె మండిపడ్డారు.

తెలుగు జాతి ముద్దుబిడ్డలు ఎన్టీఆర్, పీవీ నర్సింహారావు గార్ల ఘాట్లను ఎమ్మెల్యే అక్బరుద్దీన్ కూల్చాలని చెప్పడం చాలా దుర్మార్గం అని ఆమె అన్నారు. వీరు హిందువులు, ఆంధ్రలని కాదు.. జాతి నాయకులు అని ఆమె అన్నారు. 

భారతీయులమై ఈ మహానుభావులను సంకుచిత దృక్పథంతో చూడటం క్షమించరాని విషయమని ఆమె అభిప్రాయపడ్డారు.వీరి విషయంలో ఇంత చౌకబారుగా వ్యవహరించడం పొరపాటు అని దివ్య వాణి పేర్కొన్నారు. ఇది రాజకీయం కాదని అరాచకీయమన్నారు. రేపు ఇంకొకరు వచ్చి మరొకరి సమాధులో, విగ్రహాలో కూల్చాలంటే ఎక్కడికి పోతుంది ఈ సమాజం అని ప్రశ్నించారు. ఈ పోకడను తీవ్రంగా తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. వీరి విషయంలో మరోసారి ఎవరైనా తప్పుగా మాట్లాడితే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఆమె హెచ్చరించారు.