నిన్ననే ముగిసిన మహానాడులో దివీస్ యాజమాన్యం టిడిపికి రూ. 7.5 కోట్ల విరాళాన్ని అందించింది. విషయం తెలుసుకున్న పలువురు నేతలు విస్తుపోయారు. ఒక కంపెనీ బాహాటంగా కోట్ల రూపాయల విరాళం అందించటం మామూలు విషయం కాదు.
చంద్రబాబునాయుడుకు దివీస్ ల్యాబరేటరీస్ మధ్య బంధం బయటపడింది. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని తొండంగి వద్ద దివీస్ ఫార్మా మాన్యుఫాక్షరింగ్ యూనిట్ పెట్టాలని యాజమాన్యం నిర్ణయించింది. అనుకున్నదే తడవుగా ప్రభుత్వాన్ని కలవటం చంద్రబాబు కూడా ఓకే చేసేయటం అంతా చకచకా జరిగిపోయాయి. యూనిట్ పెట్టే ఉద్దేశ్యంతో ఎప్పుడైతే యాజమాన్యం గ్రామానికి వెళ్లిందో విషయం తెలుసుకున్న స్ధానికులు వ్యతిరేకించారు.
సరే స్ధానికులు ఎంతగా వ్యతిరేకించినా ఇటు యాజమాన్యం కానీ అటు ప్రభుత్వం గానీ నిర్ణయాన్ని మార్చుకోలేదు. ఇదే విషయమై ప్రతిపక్షంలోని వైసీపీ, వామపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా జరిపాయి. వందల మంది గ్రామస్తులను అరెస్టులు కూడా చేసారు. అయినా యాజమాన్యం వెనక్కుతగ్గలేదు.
సరే అదే విషయమై ఇప్పటికీ గ్రామంలో గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఎన్నోమార్లు పోలీసులు 144 సెక్షన్ కూడా విధించాల్సి వచ్చింది. యూనిట్ గనుక తమ గ్రామంలో ఏర్పాటు చేస్తే చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కలుషితమైపాయంటూ జనాలు ఇప్పుడు కూడా ఆందోళన చేస్తూనే ఉన్నారు. ప్రజలు అవసరం లేదు, వాతావరణ కలుషితమూ కాదు అన్నట్లుగా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తోంది.
జనాలు, ప్రతిపక్షాలు ఇంత ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం ఎందుక వెనక్కు తగ్గటం లేదన్న ప్రశ్నకు మహానాడు సమాదానమిచ్చింది. నిన్ననే ముగిసిన మహానాడులో దివీస్ యాజమాన్యం టిడిపికి రూ. 7.5 కోట్ల విరాళాన్ని అందించింది. విషయం తెలుసుకున్న పలువురు నేతలు విస్తుపోయారు. ఒక కంపెనీ బాహాటంగా కోట్ల రూపాయల విరాళం అందించటం మామూలు విషయం కాదు. బాహాటంగానే రూ. 7.5 కోట్ల విరాళం అందించారంటే తెరవెనుక ఇంకా ఎంత ముట్టిందో అంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
