ఆంధ్రప్రదేశ్‌ జలవనరుల శాఖ మంత్రి కేసు నమోదు చేయాలని గుంటూరు జిల్లా కోర్టు ఆదేశించింది. 

ఆంధ్రప్రదేశ్‌ జలవనరుల శాఖ మంత్రి కేసు నమోదు చేయాలని గుంటూరు జిల్లా కోర్టు ఆదేశించింది. మంత్రి అంబటి రాంబాబు నేతృత్వంలో సంక్రాంతి లక్కీ డ్రా పేరుతో సత్తెనపల్లిలో వైకాపా నేతలు టికెట్లు అమ్ముతున్నారని జనసేన నేతలు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మంత్రి అంబటి రాంబాబుపై, అతని అనుచరులపై చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో గుంటూరు కోర్టులో జనసేన నేత గాదె వెంకటేశ్వరరావు జిల్లా కోర్టును ఆశ్రయించారు. అయితే ఈ విషయంలో విచారణ జరిపిన జిల్లా కోర్టు.. మంత్రి అంబటి రాంబాబుపై తక్షణమే కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని పోలీసులను ఆదేశించింది.