‘దిశ’ చట్టం కాదు.. బిల్లు మాత్రమే.. అప్లికేషన్ గానే చూడాలి.. మండలిలో టీడీపీ

రాష్ట్రపతి సంతకం లేకుండా దిశ బిల్లును చట్టం అని ఎలా చెబుతారు? అంటూ టీడీపీ సభ్యులు మండలిలో హోంమంత్రిని నిలదీశారు. రాష్ట్రపతి ఆమోదం పొందకుండానే దిశ చట్టం ఎలా అవుతుందని,  అప్లికేషన్ గానే చూడాలని టీడీపీ సభ్యులు రామారావు స్పష్టం చేశారు.  కర్నూలు జిల్లా నంద్యాల, ఎమ్మిగనూరు లో Rapeకి గురైన మహిళల కేసును సీబీఐకి అప్పగిస్తామని  హోంమంత్రి ఏడాది క్రితం ప్రకటించిన అమలు కాలేదని సభ్యుడు  ఫరూక్ సభ దృష్టికి తీసుకువచ్చారు. 

disha bill is not a law.. it should be seen as an application, TDP in the council

అమరావతి :  దిశా బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం పొందడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని,  పైగా ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని శాసనమండలిలో  టిడిపి సభ్యులు విమర్శించారు.  మండలిలో గురువారం ‘మహిళా సాధికారత’ పై చర్చ సందర్భంగా  ‘దిశ బిల్లు’ ను ప్రస్తావించారు.  రాష్ట్రపతి ఆమోదం పొందకుండానే దిశ చట్టం ఎలా అవుతుందని,  అప్లికేషన్ గానే చూడాలని టీడీపీ సభ్యులు రామారావు స్పష్టం చేశారు.

Presidentసంతకం లేకుండా చట్టమని ఎలా చెబుతారు? అంటూ మరో సభ్యుడు దీపక్ రెడ్డి ప్రశ్నించారు.  కర్నూలు జిల్లా నంద్యాల, ఎమ్మిగనూరు లో Rapeకి గురైన మహిళల కేసును సీబీఐకి అప్పగిస్తామని  హోంమంత్రి ఏడాది క్రితం ప్రకటించిన అమలు కాలేదని సభ్యుడు  ఫరూక్ సభ దృష్టికి తీసుకువచ్చారు.  సిబిఐ కి పంపిన లేఖ ఇచ్చినా, వివేకానందరెడ్డి కుమార్తె సునీతమ్మలాగే సిబిఐ విచారణ కోరుతూ ఢిల్లీ కి వెళతామన్నారు.  విశాఖ లోని  గాజువాకలో ఒక యువతి అత్యాచారానికి గురైతే,  ఆత్మహత్యగా పోలీసులు కేసు నమోదు చేయడం ఎంతవరకు న్యాయమని సభ్యుడు రామారావు  హోం మంత్రిని ప్రశ్నించారు.

అవహేళన కాదు మార్పులను గమనించాలి :  సుచరిత
Disha బిల్లును  అవహేళన  చేస్తూ మాట్లాడడం కాదని,  అత్యాచారం కేసుల్లో ఏడేళ్లలో శిక్ష ఖరారు అయ్యే పరిస్థితి నుంచి ఏడు నెలల్లో శిక్ష పడే పరిస్తితికి తీసుకు వచ్చిన మార్పును గమనించాలని Home Minister Sucharita టిడిపి సభ్యులను ఉద్దేశించి  మండలిలో అన్నారు. దిశపై కేంద్రం  చిన్న కొర్రీలు వేసిందని వాటికి సమాధానం  ఇచ్చామని చెప్పారు.  అనేక రాష్ట్రాలు ఈ బిల్లును అధ్యయనం చేస్తున్నాయని అన్నారు.

ఒక కన్నును మరో కన్ను ఎలా పొడుచుకొంటుంది: వైఎస్ వివేకా హత్యపై జగన్

మహిళల సాధికారత లో భాగంగా స్థానిక సంస్థల్లో  50 శాతం  పదవులను వారికి కేటాయించినట్లు గుర్తు చేశారు. మహిళా ప్రజాప్రతినిధుల పక్కన  వారి భర్తలకు కుర్చీలు వేసే  పరిస్థితి పోవాలని సభ్యుడు లక్ష్మణరావు అభిప్రాయపడ్డారు.  మద్యంతో ఆదాయం  పెంచుకోవడం కంటే సామాజిక బాధ్యతగా నియంత్రించాలని ప్రభుత్వానికి మరో సభ్యుడు వెంకటేశ్వరరావు సూచించారు. Women's empowermentకు  ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తుందని వైకాపా సభ్యులు మాణిక్యవరప్రసాద్, పి సునీత, కల్పలత రెడ్డి, లేళ్ల  అప్పిరెడ్డి వివరించారు.

కేంద్ర పథకాలకు రాష్ట్రప్రభుత్వం స్టిక్కర్లు :  మాధవ్ 
కేంద్ర ప్రభుత్వ పథకాలు రాష్ట్ర ప్రభుత్వం స్టిక్కర్లు పెడుతున్నారని  BJP  సభ్యుడు మాధవ్ విమర్శించారు.  వైయస్సార్ చేయూత పథకం తనకైతే అర్థం కాలేదని వ్యాఖ్యానించారు.  మహిళల  ఖాతాలకు డబ్బులు వేయకుండా  వారి  స్వావలంబనకు కృషి చేయాలని సూచించారు.

రెండున్నరేళ్లయినా సిపిఎస్ రద్దు కాలేదు
సిపిఎస్ రద్దు చేయాలని కోరుతూ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని ప్రొటెం చైర్మన్   విఠపు బాలసుబ్రహ్మణ్యం తిరస్కరించారు. దీనిపై స్వతంత్ర సభ్యుడు కత్తి నరసింహారెడ్డి మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే సిపిఎస్ రద్దు చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. ఇప్పటికీ రెండున్నరేళ్ల అయింది. దీనిపై సత్వరమే నిర్ణయం తీసుకోవాలి..  అని కోరారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios